Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇలా చేస్తే అమెరికాలో ట్రంప్ బారి నుంచి బయటపడవచ్చట ఎలా?

ఉగ్రవాదుల కట్టడి విషయంలో ఇచ్చిన మాట మేరకు అన్నంత పనీ చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ముస్లిం దేశాల్లో దడ పుట్టించడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ దెబ్బకు పాక్ ప్రభుత్వం జడుసుకుని సోమవారం రాత్రి ముంబై దాడుల వ్యూహకర్త హఫీజ్ సయీద్‌ను ఆకస్మికంగా గృహనిర్బం

ఇలా చేస్తే అమెరికాలో ట్రంప్ బారి నుంచి బయటపడవచ్చట ఎలా?
హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (04:52 IST)
ఉగ్రవాదుల కట్టడి విషయంలో ఇచ్చిన మాట మేరకు అన్నంత పనీ చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ముస్లిం దేశాల్లో దడ పుట్టించడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.  ఆ దెబ్బకు పాక్ ప్రభుత్వం జడుసుకుని సోమవారం రాత్రి ముంబై దాడుల వ్యూహకర్త  హఫీజ్ సయీద్‌ను ఆకస్మికంగా గృహనిర్బంధంలోకి తీసుకుంది. ఇప్పుడు సౌదీ అరేబియా వంతు. అమెరికా తమపై ఎలాంటి నిషేధం విధించకున్నా భద్రత దృష్ట్యా, అమెరికాలో ఉన్న తన పౌరులకు సౌదీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. పౌరులారా అమెరికాలో మీరు ఇవి చేయొద్దు. అవి చేయొద్దు. ఇలా ఉండాలి, ఇలా మెలగాలి అంటూ కొన్ని సుద్దులను సౌదీ ప్రభుత్వం తన పౌరులకోసం అందించింది.
 
 తనపై ఎటువంటి నిషేధం లేకున్నా ముందు జాగ్రత్తలతో అమెరికాలోని తమ పౌరులకు సౌదీ అత్యవసరాదేశాలు జారీ చేసింది. అగ్రరాజ్యంలోని సౌదీ విద్యార్థులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలంటూ సూచించింది. ఎలాంటి పనులు చేయాలో, వేటికి దూరంగా ఉండాలో తెలిపింది. 
 
రాబోయే విపత్కర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంబసీ అధికారులు సూచిస్తున్నారు. అమెరికాలోని సౌదీ పౌరులయినా.. అగ్రరాజ్యం వెళ్లే వాళ్లయినా ఈ సూచనలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు రాబోవన్నారు.
 
అమెరికాలో మీరేం చేయవచ్చు, ఏం చేయకూడదు?
 
సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో అసాంఘీక కార్యకలాపాలకు సంబధించిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయండి. ఎయిర్‌పోర్టుల్లో, అమెరికాలోనూ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాజకీయ, మత పరమైన సిద్ధాంతాలను భావనలను బయటపడనీయకపోవడం మంచిది. 
 
తీవ్రవాదం, ఉగ్రవాదంతోపాటు తమాలకు సంబంధించిన ఫేస్‌బుక్, సోషల్ మీడియా గ్రూప్స్‌ నుంచి బయటకు వచ్చేయండి. 
అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు ఒత్తిడికి లోనవకుండా కూల్‌గా ఉండండి. 5. అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడకండి. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టకండి. అమెరికా నియమ నిబంధనలను తప్పనిసరిగా, విధిగా పాటించండి. 
 
ఎక్కడకు వెళ్లినా సంబంధిత పత్రాలను తోడుగా ఉంచుకునేలా చూడండి. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతోన్మాదంతోపాటు అమెరికా వ్యతిరేకంగా తీసిన సినిమాలను డౌన్‌లోడ్ చేసినా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చిన్న చిన్న తప్పులకు విధించిన జరిమానాలు వెంటనే కట్టేయండి. కోర్టులో హాజరయ్యే పరిస్థితిని తెచ్చుకోవద్దు. 
 
ముఖ్యంగా అమెరికా వ్యతిరేక వైఖరి ఉన్న సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవద్దని కూడా సౌదీ ప్రభుత్వం తన పౌరులను హెచ్చరించిందంటే ట్రంప్ పెట్టిన సెగ ఎంత వేడెక్కుతోందో అర్థమవుతుంది కదా. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎప్పుడు ప్రకటించామన్నది కాదయ్యా పవన్.. ఇచ్చామో లేదో చూడవేం.. వెంకయ్య బుసబుస..!