Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాళ్లున్నారో లేదో తెలీదు గానీ బిల్డప్ మాత్రం చాలా ఎక్కువగా ఇస్తున్నారు

త వందేళ్లుగా మానవ ప్రపంచాన్ని ఈ వార్త ప్రకంపనలకు గురి చేస్తూనే ఉంది. ఆ వార్త ఎన్ని డజన్ల హాలీవుడ్ కల్పిత గాథలకు, కట్టుకథలకు జన్మ నిచ్చిందో ఇప్పటికీ ఇస్తోందో చూస్తూనే ఉన్నాం. గ్రహాంతర వాసులట. మన కంటే వందల రెట్లు బుద్ధి జీవులట. కాంతివేగంతో నక్షత్రమండల

Advertiesment
NASA
హైదరాబాద్ , మంగళవారం, 27 జూన్ 2017 (02:36 IST)
గత వందేళ్లుగా మానవ ప్రపంచాన్ని ఈ వార్త ప్రకంపనలకు గురి చేస్తూనే ఉంది. ఆ వార్త ఎన్ని డజన్ల హాలీవుడ్ కల్పిత గాథలకు, కట్టుకథలకు  జన్మ నిచ్చిందో ఇప్పటికీ ఇస్తోందో చూస్తూనే ఉన్నాం. గ్రహాంతర వాసులట. మన కంటే వందల రెట్లు బుద్ధి జీవులట. కాంతివేగంతో నక్షత్రమండలాలను అధగమిస్తూ అనంత దూరాలను తృటిలో దాటేయగల మహా శక్తివంతులట. ప్రపంచం ఎన్ని సార్లు ఈ కట్టుకథలను వింటూ వచ్చిందో లెక్కలేదు. ఈ కోవలో ఒక హ్యాకింగ్ గ్రూప్ నేరుగా 12 నిమిషాల అద్భుతమైన వీడియోను సృష్టించి ప్రపంచంమీదికి వదలింది. 
 
గ్రహాంతర వాసులు ఉన్నారని నాసా ఉన్నతాధికారి ఒకరు అమెరికన్ పార్లమెంటుకే వాంగ్మూలమిచ్చినట్లు  ఆ వీడియో ప్రసంగం తెలుపటంతో లక్షలాది మంది ఇప్పటికే ఆ వీడియోను చూస్తూ షేర్ చేస్తున్నారు. ఇదంతా వట్టి హంబగ్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. బయట ఇంత సంచనలం జరుగుతున్నా నాసా మాత్రం ఇది నిజమా కాదా అనే వివరణను కూడా తన వెబ్ సైట్‌లో పెట్టకపోవడం గమనార్హం.
 
గ్రహాంతర వాసులు ఉన్నారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించిందా? నాసా సంగతేమోగానీ.. రెండు మూడు రోజులుగా ఈ వార్త నెట్‌ ప్రపంచంలో వేగంగా చక్కర్లు కొడుతోంది. నాసా ఉన్నతాధికారి ఒకరు ఈ విషయమై అమెరికన్‌ పార్లమెంటుకు వాంగ్మూలమిచ్చినట్లు యూట్యూబ్‌లో అనానిమస్ గ్లోబల్ పేరిట గుర్తుతెలియని వ్యక్తి పేరుతో ఉన్న వీడియో వైరల్‌ అవుతోంది. ఆ ఉన్నతాధికారి పేరు థామస్‌ జుర్‌బుకెన్‌ అని.. రెండు నెలల క్రితం అమెరికన్‌ పార్లమెంటుకు ఓ వాంగ్మూలమిచ్చారని వీడియోలో పేర్కొన్నారు. సింతసైజ్ చేసిన స్వరంతో వింటున్నప్పుడే వణుకు తెప్పిస్తున్నట్లున్న ఆ స్వరం ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాకింగ్ గ్రూప్‌కు చెందినదని అంతర్జాతీయ మీడియా సమాచారం. 
 
మానవజాతి గ్రహాంతర వాసుల ఉనికిని నిర్ధారించే విషయమై ఇప్పటివరకూ చేపట్టిన అన్ని కార్యక్రమాలు, ప్రయోగాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ అంచనాకు వస్తున్నట్లు థామస్‌ ఈ వీడియోలో చెబుతారు. శని గ్రహపు ఉపగ్రహాల్లో ఒక దానిపై ఆక్సిజన్‌ ఉన్నట్లు నాసా ఇటీవలే గుర్తించడం.. గురు గ్రహం ఉపగ్రహమైన యూరోపాపై సముద్రాలు ఉన్నాయన్న అంచనాలు కూడా బలపడటం.. కెప్లర్‌ టెలిస్కోపు సేకరించిన సమాచారం ఆధారంగా జరిపిన విశ్లేషణ కారణంగా 219 కొత్త ఎక్సోప్లానెట్లను గుర్తించడం తదితర పరిణామాలను ఈ వీడియోలో ఉటంకించారు. 
 
ఈ నేపథ్యంలో ఇతర గ్రహాలపై జీవం ఉండేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే నాసా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన లేదు. ఈ వీడియో ఉన్న యూట్యూబ్‌ అకౌంట్‌ ఓ హ్యాకర్‌ గ్రూప్‌నకు చెందినది కావడం కొసమెరుపు.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడది కంట కనబడితే చాలు కౌగలించి ముద్దుపెట్టేయడమే.. పైగా మత్తులో ఆ పని చేశానని ఫోజు