Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానంలోకి పాములు ఎలా వచ్చాయ్.. ప్రయాణీకులు పరుగో పరుగు (వీడియో)

విమానంలోకి పాములు వచ్చి బీభత్సం సృష్టించాయి. ఇది నిజంగానా? లేదా సినిమా స్టోరీనా అని అనుకుంటున్నారు. కదూ.. అయితే చదవండి. 'స్నేక్స్‌ ఆన్‌ ఎ ప్లేన్‌' అనే ఇంగ్లీష్ సినిమాలో అనేక పాములు విమానంలోకి వచ్చేస్త

Advertiesment
Snake on Plane
, మంగళవారం, 8 నవంబరు 2016 (12:37 IST)
విమానంలోకి పాములు వచ్చి బీభత్సం సృష్టించాయి. ఇది నిజంగానా? లేదా సినిమా స్టోరీనా అని అనుకుంటున్నారు. కదూ.. అయితే చదవండి. 'స్నేక్స్‌ ఆన్‌ ఎ ప్లేన్‌' అనే ఇంగ్లీష్ సినిమాలో అనేక పాములు విమానంలోకి వచ్చేస్తాయి. ఆపై ప్రయాణీకులను హడలెత్తిస్తాయి. అయితే తాజాగా అలాంటి సీన్ నిజ జీవితంలో రిపీట్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. మెక్సికో దేశంలోని టోరియాన్‌ నుంచి మెక్సికో సిటీకి వెళుతున్న ఓ విమానంలో పాములు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా... ఇంతలో కొందరు ప్రయాణికులు విమానం పై భాగంలో పాములు వేలాడుతున్నట్లు గుర్తించి భయంతో లేచి పరుగెత్తారు.
 
వారితోపాటు మరికొందరు కూడా విమానం నుంచి కిందికి దిగిపోయారు. కొందరు మాత్రం విమానంలోనే ఉండి పాముల్ని తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించారు. ఒక పాము అయిదడుగుల పొడవు ఉందని, అది ఏ జాతికి చెందినదో తెలియలేదని ఓ ప్రయాణీకుడు తెలిపాడు. అసలు విమానంలోకి పాములు ఎలా వచ్చాయనే దానిపై సదరు విమానయాన సంస్థ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేఎన్టీయూలో కండోమ్‌లు.. అబార్షన్ ఇంజెక్షన్‌లే కనిపిస్తాయా? : కేంద్రంపై విరుచుకుపడిన కన్హయ్య కుమార్