Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్

Advertiesment
imran khan

ఠాగూర్

, శుక్రవారం, 23 మే 2025 (12:32 IST)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేట్టిన సైనిక చర్యలో చావుదెబ్బతిన్నప్పటికీ పాకిస్థాన్ పాలకుల వంకర బుద్ధిమాత్రం మారలేదు. భారత్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్ తోకముడిచినప్పటికీ.. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిఫ్ మునీర్‌కు మాత్రం ఫీల్డ్ మార్షల్ అనే హోదాను పాక్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ తరహా హాదాను పొందిన రెండో వ్యక్తి మునీర్ కావడం గమనార్హం. 
 
దీనిపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆటవిక చట్టం సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో జనరల్ మునీర్‌కు రాజు అనే బిరుదు ఇచ్చివుంటే ఇంకా బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జైలు నుంచే ఎక్సే వేదికగా ఓ ట్వీట్ చేశారు.
 
పాకిస్థాన్ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన రెండో సైనికాధికారిగా జనరల్ మునీర్ కావడం గమనార్హం. ఈ పదోన్నతిపై ఇమ్రాన్ స్పందిస్తూ, 'మాషా అల్లా.. జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌ను  చేశారు. నిజం చెప్పాలంటే ఆయనకు రాజు అనే బిరుదు ఇచ్చివుంటే ఇంగా బాగుండేది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఆటవిక చట్టం నడుస్తోంది. అడవిలో ఒక్కడే రాజు ఉంటాడు' అని వ్యాఖ్యానించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు