Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవును.. ఆ వయస్సులో ఒకరిని గాఢంగా ప్రేమించాను: బ్రిటన్ యువరాణి డయానా

బ్రిటన్ యువరాణి డయానా జీవితానికి సంబంధించిన ఆడియో టేపులు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కలకలం రేపుతున్నాయి. డయానా మాటల్లో.. ఆమె అనుభవించిన కష్టనష్టాలను తెలిపే ఆడియోలున్నట్లు ఓ ఛానల్ ప్రచురించింది. ఆ టేపుల్లో డ

Advertiesment
అవును.. ఆ వయస్సులో ఒకరిని గాఢంగా ప్రేమించాను: బ్రిటన్ యువరాణి డయానా
, సోమవారం, 31 జులై 2017 (16:28 IST)
బ్రిటన్ యువరాణి డయానా జీవితానికి సంబంధించిన ఆడియో టేపులు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కలకలం రేపుతున్నాయి. డయానా మాటల్లో.. ఆమె అనుభవించిన కష్టనష్టాలను తెలిపే ఆడియోలున్నట్లు ఓ ఛానల్ ప్రచురించింది. ఆ టేపుల్లో డయానా సంభాషణ ప్రస్తుత ప్రిన్స్ విలియమ్స్, హ్యారీలను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని, వాటిని ప్రసారం చేయొద్దని డయానా సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ ఆ ఛానల్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే బ్రిటన్ ప్రిన్స్‌ ఛార్లెస్‌తో వివాహానంతరం ఇతర మహిళలతో అతను కొనసాగించిన సంబంధాలపై డయానా పలుసార్లు ప్రశ్నించింది.
 
నిరాడంబరతకు మారుపేరుగా మన్ననలు అందుకున్న డయానా ఛార్లెస్‌లోని ప్రేమరాహిత్యాన్ని, ప్రేమ లేని వివాహాన్ని సహించుకోలేకపోయింది. దీంతో ఆమె అంగరక్షకుడు బారీ మన్నాకీతో డయానా ప్రేమలో పడినట్లు సదరు ఛానల్ కథనం ప్రచురించింది. ఆ కథనంలో డయానాకు సంబంధించిన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయం టేపుల్లో వెల్లడి అయినట్లు తెలిపింది. ఈ టేపులు డయానాకు పాఠాలు నేర్పిన పీటర్‌ సెట్టెలన్‌ రికార్డు చేసిన వీడియోలకు చెందినవని.. కెన్సింగ్‌ టన్‌ ప్యాలెస్‌లో 1992-93 మధ్యకాలంలో వీటిని రికార్డు చేసినట్టు పేర్కొంది.
 
స్వరాన్ని పరీక్షించే సమయంలో ఆమె మాటల్ని రికార్డు చేశారని, 1991లో ప్రిన్స్ ఛార్లెస్‌తో విడిపోయాక.. తన భావాలను ప్రజలకు చెప్పేందుకు వీలుగా సహాయ పడడం కోసం ఆమె సెట్టెలన్‌‌ను నియమించుకున్నారు. ఆ సమయంలో డయానా తన వ్యక్తిగత సంభాషణల్లో 24 లేదా 25 ఏళ్ల వయసులో తానొకరిని గాఢంగా ప్రేమించానని.. అతడు కూడా అదే వాతావరణంలో పనిచేసేవాడని చెప్పారు. ప్రేమించడం వరకే కాదు.. అతడితో నిరాడంబరంగా జీవించేందుకు సంతోషంగా అంగీకరించానని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 9న భారత్ మార్కెట్లోకి లెనోవో కె8 నోట్ స్మార్ట్ ఫోన్