Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బురఖా వదలకూడని దేశంలో స్కర్టుతో తిరిగిన యువతి.. భగ్గుమన్న సౌదీ

బహిరంగ స్థలంలో చట్ట విరుద్ధంగా స్కర్టు వేసుసుని నడిచి, వీడియో తీసి పోస్టు చేసినందుకు గాను సౌదీ అరేబియా పోలీసులు ఒక యువతిని అరెస్టు చేశారు. ప్రముఖ సందర్శన స్థలంలో సాంప్రదాయికమైన ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌

Advertiesment
saudi woman in a skirt sensational viral video సౌదీ మహిళ
హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (08:39 IST)
బహిరంగ స్థలంలో చట్ట విరుద్ధంగా స్కర్టు వేసుసుని నడిచి, వీడియో తీసి పోస్టు చేసినందుకు గాను సౌదీ అరేబియా పోలీసులు ఒక యువతిని అరెస్టు చేశారు.  ప్రముఖ సందర్శన స్థలంలో సాంప్రదాయికమైన ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను ధరించకుండా ఆధునిక దుస్తుల్లో మోడల్ లాగా తిరిగినందుకు గానూ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వారాంతంలో సౌదీ రాజధానికి సమీపంలోని చారిత్రక గ్రామం అయిన నజ్డ్‌లో బహిరంగంగా తిరిగినందుకు ఆమెకు అదుపులోకి తీసుకున్నారు. ఆ గ్రామంలో సౌదీ అరేబియాలోని అత్యంత సంప్రదాయికమైన తెగలు, వారి కుటుంబాలు నివసిస్తుండటంతో వారి గౌరవానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదు. 
 
కానీ ఆ అమ్మాయి చేసిన పని సౌదీ అరేబియా వ్యాప్తంగా ఆగ్రహాశాలను రగిలించింది. పైగా తాను చేసిన పనిని వీడియోకు ఎక్కించి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సౌదీ ప్రజలకు గంగవెర్రులెత్తినంత పనయింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపట్ల తమ అసంతృప్తికి ప్రదర్సించేందుకు సౌదీప్రజలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ 31 ఏళ్ల ఆ మహిళ చేసిన పనికి తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఆ యువతిని అరెస్ట్ చేయాలని సౌదీ యువత, నెటిజన్లు డిమాండ్ చేశారు.
 
సౌదీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ యువతి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. సౌదీ రాజధాని రియాధ్‌కు 95 మైళ్ల దూరంలో ప్రముఖ సందర్శన స్థలమయిన ఉషాయ్‌కిర్ దగ్గర ఉండే నజ్డ్ అనే గ్రామ పరిసర ప్రాంతాలకు ఓ యువతి వెళ్లింది. వీకెండ్‌లలో ఎవరూ లేని సమయంలో అక్కడకు వెళ్లి.. సౌదీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దుస్తులు ధరించి ఓ వీడియో తీసుకుంది. 
 
సౌదీ చట్టాల ప్రకారం హిబాబ్ గానీ, బురఖా కానీ.. లేకుండా స్త్రీలు బయటకు రాకూడదు. కానీ ఈ యువతి మాత్రం అందుకు విరుద్ధంగా హిబబ్ లేకుండా.. స్కర్టులు వేసుకుని ఫ్యాషన్‌ షోలో నడుస్తున్నట్లుగా ఆరు సెకన్ల పాటు వీడియోను తీసుకుంది. దీన్ని సోషల్ మీడియాలో పాపులర్ యూజర్ అయిన ఖులూడ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో సౌదీ సోషల్ మీడియా ఒక్కసారిగా భగ్గుమంది. 
 
సౌదీ పౌరులైన మహిళలు ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. అయితే సౌదీకి వచ్చే విదేశీయులకు మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. బురఖా లేకున్నా.. సౌదీ సంప్రదాయాలను గౌరవిస్తూ అసభ్యకరంగా లేని దుస్తులను విదేశీయులు ధరించొచ్చు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుల్లుగా తాగింది. కైపెక్కింది.. బట్టలిప్పేసింది.. పోలీసులను తన్నింది.. తర్వాతేం జరిగిందంటే..