అల్-ఫా ఆర్కియాలజికల్ ఏరియా అరేబియా నడిబొడ్డున ఉన్న పురాతన వాణిజ్య మార్గాల వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది, ఇందులో ఖర్యాత్ అల్-ఫా నగరం యొక్క అవశేషాలు ఉన్నాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వదిలివేయబడిన ఈ ప్రదేశంలో సౌదీ యొక్క గొప్ప వారసత్వం, సంస్కృతిని వెల్లడిస్తూ దాదాపు 12,000 పురావస్తు అవశేషాలు ఉన్నాయి.
రియాద్‌కు నైరుతి దిశలో దాదాపు 650 కి.మీ, వాడి అల్-దవాసిర్‌కు దక్షిణంగా 100 కి.మీ దూరంలో అల్-ఫా ఉంది. ఇది సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యతల సమ్మేళనం. బాగా సంరక్షించబడిన శిధిలాలు, నీటి నిర్వహణ వ్యవస్థలు, సాధనాలు- శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఈ పురావస్తు ప్రదేశం మరొక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం 'ఉరుక్ బని మారిడ్' సమీపంలో ఉంది.
రియాద్ నుండి అల్ జాఫ్‌కు విమానాలు వున్నాయి. ప్రయాణికులు అల్ జాఫ్ నుండి కార్లను అద్దెకు తీసుకోవచ్చు లేదా టాక్సీలను తీసుకోవచ్చు. వసతి సౌకర్యాలు ఒక రాత్రికి $150 నుండి ప్రారంభమవుతాయి. ఇ-వీసా ప్రోగ్రామ్ సౌదీని సందర్శించడం సులభం చేస్తుంది, ఇప్పుడు 66 దేశాల ప్రయాణికులకు ఇది అందుబాటులో ఉంది. సౌదీ యొక్క తాజా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన అల్-ఫా యొక్క గొప్ప చరిత్ర మరియు సహజ సౌందర్యాన్ని అన్వేషించండి.