Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న దేశాధ్యక్షుడి కుమార్తె ఎవరు?

ఆయన దేశాధ్యక్షుడు. వచ్చే నవంబరు నాటికి అధ్యక్ష భవనం నుంచి వీడనున్నారు. కానీ, పదేళ్ళ పాటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నా... తన ఇద్దరు కుమార్తెలను క్రమశిక్షణతో పెంచారు. ఆ దేశాధ్యక్షుడే బరాక్ ఒబామా. ఈయన వచ్చ

Advertiesment
Sasha Obama
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:29 IST)
ఆయన దేశాధ్యక్షుడు. వచ్చే నవంబరు నాటికి అధ్యక్ష భవనం నుంచి వీడనున్నారు. కానీ, పదేళ్ళ పాటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నా... తన ఇద్దరు కుమార్తెలను క్రమశిక్షణతో పెంచారు. ఆ దేశాధ్యక్షుడే బరాక్ ఒబామా. ఈయన వచ్చే నవంబరు నెలలో అమెరికా అధ్యక్ష భవనాన్ని వీడినున్నారు. కానీ, ఈయన రెండో కుమార్తె సాషా ఒబామా ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నారు.
 
ప్రస్తుతం ఆమె వయసు 15 యేళ్లు. తన తండ్రి వైట్‌హౌస్‌ను వీడాల్సి వచ్చిన సమయం దగ్గర పడిన వేళ, జీవన గమనానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రైడ్ సీ ఫుడ్, మిల్క్ షేక్‌లకు పేరున్న 'నాన్సీ' అనే రెస్టారెంటులో పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది. 
 
ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆమె, అది పూర్తయిన తర్వాత మీడియా రంగంలో స్థిరపడాలన్నది తన కోరికని సాషా గతంలోనే చెప్పింది. బ్లూ షర్టు, ఖాకీ బ్యాంక్స్ వేసుకుని తలపై టోపీతో కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటుంటే, ఈ విషయం హాట్ టాపిక్ అయి, రెస్టారెంటుకు వస్తున్న కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆమెకు భద్రతగా ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు అక్కడే ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌కు వెళ్లింది విందు కోసం కాదు : హోంమంత్రి రాజ్‌నాథ్