Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రష్యా ప్లాన్!!

power cuts

ఠాగూర్

, బుధవారం, 6 మార్చి 2024 (14:30 IST)
చంద్రుడిపై  అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేదుకు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోసి చర్యలు చేపట్టింది. వచ్చే 2033-35 నాటికి ఈ ప్లాట్‌ను నిర్మించాలని భావిస్తుంది. ఈ విషయాన్ని రోస్కోస్మోస్ అధిపతి యూరి బోరిసోవ్ మంగళవారం ప్రకటించారు. ఈ దిశగా రష్యా, చైనా సంయుక్తంగా పని చేస్తున్నాయని, ఈ మిషన్‌లో రష్యా 'అణు అంతరిక్ష శక్తి' నైపుణ్యాలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏదో ఒక రోజు జాబిల్లిపై ఆవాసాల నిర్మాణానికి అనుమతి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
'చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2033-2035 నాటికి ఏర్పాటు చేస్తాం. ఈ దిశగా చైనాకు చెందిన సహోద్యోగులతో కలిసి పనిచేస్తున్నాం. చంద్రుడి ఉపరితలంపై పవర్ యూనిట్ ఏర్పాటు, విద్యుత్ పంపిణీ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా కఠినమైన సవాలు. మానవుల ఉనికి లేకుండా ఆటోమేటిక్ మోడ్‌లో చేయాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో సౌర ఫలకాలు చంద్రుడిపై ఆవాసాలకు తగినంత విద్యుత్‌ను అందించలేవు. అణుశక్తి ఈ పనిని చేయగలదు' అని బోరిసోవ్ వివరించారు.
 
అణుశక్తితో నడిచే కార్గో స్పేస్ పన్ను నిర్మించాలని రష్యా భావిస్తోందని బోరిసోవ్ వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అణు రియాక్టర్‌ను చల్లబరచడంతో పాటు ఇతర సవాళ్లకు పరిష్కారాలను కనుగొన్నామని, అన్ని సాంకేతిక ప్రశ్నలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. స్పేస్ టగ్బోట్ (నౌక లాంటిది) తయారీపై పనిచేస్తున్నామని తెలిపారు. 
 
ఈ భారీ సైక్లోపియన్ 'టగ్బోట్' ద్వారా అణు రియాక్టర్, హై-పవర్ టర్బైన్లు సాధ్యమవుతాయని, పెద్ద పెద్ద కార్గోలను ఒక కక్ష్య నుంచి మరొక కక్ష్యకు రవాణా చేయడం సాధ్యమవుతుందని బోరిసోవ్ వివరించారు. అంతరిక్ష శిథిలాల సేకరణ, అనేక కార్యక్రమాలలో పాల్గొనడానికి టగ్బోట్ ఉపయోగపడుతుందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ మార్కెట్లోకి రిహన్నా బ్యూటీ ప్రాడెక్ట్... ఏంటది?