Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు ఢీకొనడం కారణం కాదా?

plane crash

ఠాగూర్

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (14:46 IST)
ఇటీవల అజర్‌బైజాన్‌కు చెందిన విమానం ఒకటి కజకిస్థాన్‌లో కూలిపోయింది. పక్షుల గుంపు ఢీకొనడం వల్ల ఈ విమానం కూలిపోయినట్టు వెల్లడించారు. అయితే, ఈ విమాన ప్రమాదంపై చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు కారణం కాదని తెలుస్తుంది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య గత కొంతకాలంగా యుద్ధం సాగుతుంది. ఉక్రెయిన్ సైన్య రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడుతుంది. దీంతో ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్ డ్రోన్‌గా భావించి రష్యా మిలిటరీ కాల్పులు జరపడం వల్లే ఈ విమానం కూలిపోయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
విమానం వెనుకభాగంలో కనిపిస్తున్న రంధ్రాలు తూటాలు దూసుకెళ్లడం వల్ల పడినవేనన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. విమానం కూలిపోవడానికి ముందు లోపల ఒకరు తీసిన వీడియోలో ఓ మహిళ కాలికి గాయమైన దృశ్యాలు, క్యాబిన్ వాల్‌పై కనిపించిన రంధ్రాలు కూడా ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అజర్‌బైజాన్ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభిం చింది. 
 
కాగా, రష్యా గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటున కాల్పులు జరపడం వల్లే విమానం కూలిపోయిందన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. దర్యాప్తు పూర్తయితే అసలు కారణాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి సూచించారు. బుధవారం అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆ దేశ రాజధాని బాకూ నుంచి రష్యాలోని గ్రోజ్నీ నగరానికి వెళుతుండగా కజికిస్థాన్‌లో కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 38 మంది ప్రయాణికులు మరణించారు. మిగతా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. విమానం పక్షులను ఢీకొట్టిన తర్వాత అత్యవరసర పరిస్థితి తలెత్తిందని, దాంతో కజికిస్థాన్‌లోని ఆక్టె విమానాశ్రయంలో దింపే ప్రయత్నంలో కూలిపోయిందన్నది ప్రాథమిక సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!