Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒమాబా దంపతులు నిద్రించిన రష్యా సూట్‌లో ట్రంప్ రాసలీలలు. అమెరికన్లలో కలవరం

రష్యా పర్యటనలో ఒబామా దంపతులు విడిది చేసిన సూట్‍‌లో, అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వేశ్యలతో కలిసి సరససల్లాపాలు సాగించాడా? రష్యా పర్యటనలో ఉన్నప్పుడు ట్రంప్ వ్యభిచారిణులతో జరిపిన రాసల

ఒమాబా దంపతులు నిద్రించిన రష్యా సూట్‌లో ట్రంప్ రాసలీలలు. అమెరికన్లలో కలవరం
హైదరాబాద్ , శుక్రవారం, 13 జనవరి 2017 (06:43 IST)
రష్యా పర్యటనలో ఒబామా దంపతులు విడిది చేసిన సూట్‍‌లో, అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వేశ్యలతో కలిసి సరససల్లాపాలు సాగించాడా? రష్యా పర్యటనలో ఉన్నప్పుడు ట్రంప్ వ్యభిచారిణులతో జరిపిన రాసలీలల వీడియోలు రష్యా గూడఛార సంస్థ చేతికి చిక్కాయని వస్తున్న వార్తలు ట్రంప్ కంటే అమెరకన్లను ప్రస్తుతం కలవరపరుస్తున్నాయి. అవన్నీ కల్పిత వార్తలనీ, చెత్త విషయాలని, అలాంటి సంఘటన అసలు జరగలేదని ట్రంప్ బుధవారం తొలి పత్రికా సదస్సులో కొట్టిపడేసినప్పటికీ ట్రంప్ రాసలీలల వీడియోలకు సంబంధించిన సమాచారం రోజుకొక్కటిగా వెల్లడవుతూనే ఉంది.
 
పరిశోధనాత్మక వెబ్‌సైట్ న్యూస్.కామ్.ఎయు ప్రకారం ట్రంప్ గతంలో రష్యా పర్యటనలో ఉన్న్పపుడు మాస్కోలో రి్ట్జ్ కార్లటోన్ హోటల్‌లోని ప్రెసిడెంన్షియన్ సూట్‌లో విడిది చేసినట్లు సాక్ష్యాధారాలు బయటపడుతున్నాయి. ఆ సూట్‌లో గతంలో ఒబామా దంపతులు విడిది చేశారని సమాచారం. అదే సూట్‌లో ట్రంప్ అనేకమంది వ్యభిచారిణులను రప్పించి అసహజ లైంగిక కార్యాలు జరపాల్సిందిగా వారిని ప్రేరేపిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయని సమాచారం. ఆ వ్యభిచారిణుల ముందు నిలబడి బంగారు జల్లులు (మూత్ర విసర్జన) పోయవలసిందిగా వారిని ట్రంప్ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 
 
70 ఏళ్ల వయసు కలిగిన ట్రంప్ ఈ వార్తలను తీవ్రంగా ఖండించాడు. నేను రష్యా వెళ్లింది వాస్తవం. కొన్నేళ్లక్రితం మిస్ యూనివర్శిటీ పోటీల్లో భాగంగా రష్యాకు వెళ్లాను. ఆ కార్యక్రమం బాగా జరిగింది. అంతే కానీ మీడియాలో నాపై వస్తున్న ప్రచారం అంతా భోగస్ అని ప్రకటించారు. పైగా టెలివిజన్‌లో మీ ముఖం చూసుకునే పరిస్థితి రానీయవద్దని, అన్ని చోట్లా కెమెరాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా తానే చాలామందిని హెచ్చరించానని ట్రంప్ మీడియాకు తెలిపారు. 
 
కానీ, ఒబామా దంపతులు నిద్రించిన ఆ సూట్‌లోని బెడ్ పైనే ట్రంప్ అత్యంత అసహజమైన శృంగార చర్యలకు పాల్పడవలసిందిగా వేశ్యలను ఒత్తిడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వీడియోను చూపి ట్రంప్‌ను రష్యా లోబర్చుకుందని వస్తున్న వార్తలు అమెరికన్లను దిగ్భ్రాంతిలో ముంచుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనోభావాలను దెబ్బతీసినందుకు సారీ.. అమెజాన్ ఒప్పుకోలు