Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎందుకూ పనికిరాదని పడేసిన బ్యాగు రూ.11 కోట్లు పలికింది

1969లో చంద్రుడిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అప్పట్లో వాడిన ఓ బ్యాగు ఇంకా భద్రంగా ఉండటమే కాదు. వేలంపాటలో రూ. 11 కోట్లుపలికి రికార్డు సృష్టించింది. సౌత్‌బే నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఫ

Advertiesment
ఎందుకూ పనికిరాదని పడేసిన బ్యాగు రూ.11 కోట్లు పలికింది
హైదరాబాద్ , శనివారం, 22 జులై 2017 (07:49 IST)
మానవజాతి చరిత్రలో అత్యద్బుతమైన ఘటనకు సాక్షిగా నిలిచినవాడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. దేవతల్లో ఒకరిగా ప్రపంచంలోని జాతులన్నీ భావించే చంద్రుడిపై మొదటిసారిగా కాలుపెట్టి అక్కడ దుమ్మూ ధూళీ తప్ప మరేమీ లేవని చాటి చెప్పినవాడతడు. దాదాపు 48 ఏళ్ల క్రితం అతడావిష్కరించిన సత్యం అంతరక్షాన్ని అధిగమించాలనుకుంటున్న సైంటిస్టులకు ఎనలేని ఆత్మవిశ్వాసం అందించింది.  
 
ఇది మరొక విషయం. 1969లో చంద్రుడిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అప్పట్లో వాడిన ఓ బ్యాగు ఇంకా భద్రంగా ఉండటమే కాదు. వేలంపాటలో రూ. 11 కోట్లుపలికి  రికార్డు సృష్టించింది. సౌత్‌బే నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ ద్వారా దీన్ని కొనుగోలు చేశారు. 1969లో అపోలో–11 నౌక ద్వారా నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌లు చంద్రుడిపైకి చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌక తిరిగొచ్చాక అందులోని వస్తువులన్నింటినీ స్మిత్‌సోనియన్‌ సంస్థకు ఇచ్చేశారు.
 
అయితే ఈ క్రమంలో జరిగిన ఒక తప్పిదం వల్ల చంద్రుడిపై నమూనాలు సేకరించేందుకు వాడిన ఓ బ్యాగు జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లోనే ఉండిపోయింది. బ్యాగు ప్రాముఖ్యం తెలియని వారు కొందరు దీన్ని పారేయబోతూ కన్సాస్‌లోని ఓ ప్రైవేట్‌ మ్యూజియం యజమానికి చూపించారు. కొంత కాలం తర్వాత ఓ చోరీ కేసులో ఈ యజమానికి శిక్ష పడటంతో ఎఫ్‌బీఐ ఈ బ్యాగును స్వాధీనం చేసుకుని 2015లో అతి కష్టమ్మీద 995 డాలర్లకు అమ్మింది. ఇప్పుడు మళ్లీ రూ.11 కోట్ల 58 లక్షల 25 వేల 5 వందల యాభై రూపాయలకు అమ్ముడుబోయిందీ బ్యాగు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన పురాతన కల నిజం కానుందా.. మనిషి అదృశ్యం కానున్నాడా.. ఎలా?