రజినీకాంత్ చిట్టి రోబోను చూశారు కదూ.. 19 భాషలు మాట్లాడే రోబోను రియల్ లైఫ్‌లో చూశారా?
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో చిత్రం గుర్తుంది కదా. ఆ చిత్రంలో చిట్టి పాత్రను పోషించిన రోబో హీరో ఏది చెబితే అది చేస్తుంది. నిజంగా ఇలాంటి రోబోలున్నాయా అనే అనుమానం కలుగక తప్పదు. కానీ ని
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో చిత్రం గుర్తుంది కదా. ఆ చిత్రంలో చిట్టి పాత్రను పోషించిన రోబో హీరో ఏది చెబితే అది చేస్తుంది. నిజంగా ఇలాంటి రోబోలున్నాయా అనే అనుమానం కలుగక తప్పదు. కానీ నిజంగా ఇలాంటి రోబోలున్నాయనే చెప్పాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో ముందున్న చైనా పరిశోధకులు మాట్లాడే రోబోను ఎప్పుడో సృష్టించారు.
రోబోలు నడవటం, పనులు చేయడం ఇవన్నీ మనకి తెలిసిందే. ఇలాంటి రోబోలను రైల్వే స్టేషన్‌లో, హోటళ్లలో వెయిటర్‌గా, వార్తలు చదివేట్టుగా ఇలా చాలా రకాలుగా చూసే ఉంటాం. కాని మనిషిలాగే మాట్లాడే రోబోలను ఎప్పుడైనా చూశారా... ఇంత వరకు చూడలేదు కదూ... అలాంటి రోబో బెల్జియంలోని ఎ.జెడ్ దామియాన్ హాస్పిటల్‌లో ఉంది.
ఈ రోబో ఏకంగా 19 భాషలు మాట్లాడుతుంది. ఈ రోబోకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా... ఆసుపత్రికి వచ్చేవారికి ఎటువంటి సందేహం ఉన్నా వారి భాషలోనే మాట్లాడి సంబంధిత గదులకు తీసుకుని వెళ్తుంది. జోరా బోట్స్ అనే సంస్థ రూపొందించిన ఈ రోబో 19 భాషల్లో మాట్లాడుతూ అందరిని అబ్బురపరుస్తోంది. ఆ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు చాలా రోబోలున్నాయి. కాని మాట్లాడే రోబో మాత్రం ఇదే. ఇదివరకు ఈ హాస్పిటల్‌లోనే జోరా అనే రోబో ఉండేది. దీనిని ఫిజియోథెరపి తరగతుల కోసం వైద్యులు ఉపయోగించేవారట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ...