Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూజిలాండ్ బాటలో బ్రిటన్.. ధూమపాన రహిత దేశంగా..

rishi sunak
, ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (11:18 IST)
నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న నిర్ణయంతో గత యేడాది న్యూజిలాండ్ దేశం తమ దేశంలో ధూమపానాన్ని నిషేధించింది. ఇపుడు ఇదేబాటలో బ్రిటన్ కూడా పయనించనుంది. 2030 నాటికి ధూమపాన రహిత దేశంగా చేయాలని సంకల్పించింది. ఇందులోభాగంగా 2009 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారికి సిగరెట్లు అమ్మకుండా నిషేధం విధించింది. 
 
ఇందుకోసం విధివిధానాల రూపకల్పన కోసం సమాయత్తమవుతుంది. ఈ విషయంలో న్యూజిలాండ్ గత యేడాది తీసుకొచ్చినటువంటి విధివిధానాలనే అమలు చేయాలని నిర్ణయించింది. న్యూజిలాండ్‌లో కొన్ని ప్రత్యేకమైన దుకాణాల్లో మాత్రమే సిగరెట్లు విక్రయిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారుడిని లక్ష్యంగా చేసుకుని విధానాల రూపకల్పనకు సిద్ధమవుతుంది.
 
2030 నాటికి ధూమపాన రహిత దేశంగా మార్చేలా మరింత మందిని ప్రోత్సహించాలనుకుంటున్నాం. అందులోభాగంగా, ధూమపాన రేటును తగ్గించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం అని బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. గర్భిణిలు ధూమపానాన్ని విడిచిపెట్టేలా ప్రోత్సహించే ఉచి వేప్ ‌కిట్‌ల వోచర్ పథకం కూడా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఉంచనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్యుమార్పిడితో సిద్ధం చేసిన పంది గుండెను మనిషికి అమర్చిన వైద్యులు... ఎక్కడ?