Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకటన తెరపై అశ్లీల వీడియో... నోరెళ్లబెట్టి చూస్తుండిపోయిన వాహనచోదకులు....

ఈ మధ్య గుట్టుగా సాగాల్సిన వ్యవహారాలు రోడ్డెక్కేస్తుంటే, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా నడి రోడ్డులో.. అదీ రద్దీ ట్రాఫిక్‌లో.. చూడకూడని ఓ దృశ్యం ప్రత్యక్షమయ్యేసరికి వాహనదారులు ఒక్కసారిగా నివ్వ

ప్రకటన తెరపై అశ్లీల వీడియో... నోరెళ్లబెట్టి చూస్తుండిపోయిన వాహనచోదకులు....
, సోమవారం, 3 అక్టోబరు 2016 (11:47 IST)
ఈ మధ్య గుట్టుగా సాగాల్సిన వ్యవహారాలు రోడ్డెక్కేస్తుంటే, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా నడి రోడ్డులో.. అదీ రద్దీ ట్రాఫిక్‌లో.. చూడకూడని ఓ దృశ్యం ప్రత్యక్షమయ్యేసరికి వాహనదారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆ ఘటనని చూసి ఇదేమిటని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ వింత ఘటన జకార్తాలోని ఓ రద్దీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ ప్రకటన తెరపై అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు పరుగులు పెట్టారు. 
 
ఆ వివరాల్లోకి వెళ్తే... ఇండోనేషియా రాజధాని జకార్తాలోని రద్దీ వీధిలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో అక్కడున్న ప్రకటన తెరపై ఓ అశ్లీల వీడియో ప్రత్యక్షమైంది. వాహనాన్ని కూడా ఆపేసి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు పరుగు పరుగున వెళ్లి ఆ బిల్ బోర్డ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటన దక్షిణ జకర్తా మేయర్ కార్యాలయం సమీపంలోనే చోటుచేసుకోవడం మరీ విడ్డూరం. అయితే ఇది అనుకోకుండా జరిగిందో, కావాలనే ఎవరైనా చేశారో తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు అక్కడి పత్రికలు వెల్లడించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘సర్జికల్ దాడి’ పాక్ పైన చేస్తే... చైనా బెదుర్స్ ఎందుకు? ఇండియా చెప్పినట్లే ఇరాన్....