Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్బన్ డయాక్సైడ్ వాహనాల ఇంధనంగా మారనుందట

శాస్త్రవేత్తలు పరిశోధన విజయవంతమైతే కార్బన్ డయాక్సైడ్(సీవో2) త్వరలో వాహనాల ఇంధనంగా మారబోతుంది. మారుతున్న వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు విపరీతంగా విడుదలవుతుండడంతో పలు మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి

కార్బన్ డయాక్సైడ్ వాహనాల ఇంధనంగా మారనుందట
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (16:43 IST)
స్త్రవేత్తలు పరిశోధన విజయవంతమైతే కార్బన్ డయాక్సైడ్(సీవో2) త్వరలో వాహనాల ఇంధనంగా మారబోతుంది. మారుతున్న  వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు విపరీతంగా విడుదలవుతుండడంతో పలు మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జనజీవనానికి ముప్పు వాటిల్లుతుందని ముందుగానే అంచనా వేసిన శాస్త్రవేత్తలు వాతావరణంలోకి విడుదలవుతున్న సీవో2ను రీసైక్లింగ్ ద్వారా కార్బన్-మోనాక్సైడ్(సీవో)గా మార్చాలని భావిస్తున్నారు. 
 
మెంథాల్, ఇథనాల్, డీజిల్ తదితర ఇంధనాలు కార్బన్ మోనాక్సైడ్ రూపాలే కాబట్టి కార్బన్ డయాక్సైడ్‌ను సులువుగా గ్రీన్‌హౌస్ గ్యాస్‌గా, ఇతర ఉపయోగకరమైన రసాయనాలుగా మార్చే విధానాన్ని టొరొంటో యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. టోరంటో యూనివర్శిటీ ఫ్రొఫెసర్ మిన్ లియు, వైయుంజీ పాంగ్ నేతృత్వంలో విద్యార్థుల బృందం ఈ పరిశోధనలపై దృష్టి సారించింది. 
 
బొగ్గుపులుసు పునరుత్పాదక శక్తిగా మార్చే పద్ధతిని కనుగొన్నారు. వాతావరణం నుంచి కానీ, కంపెనీల నుంచి కానీ విడుదలయ్యే ఉద్గారాలను సేకరించి దానిని ఉపయోగకరమైన వాయువుగా మార్చగలిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టగలిగినట్టేనని ప్రొఫెసర్ పాంగ్ పేర్కొన్నారు. వాతావరణంలో పెరిగిపోతున్న సీవో2 తగ్గించడమే కాకుండా ప్రజలకు ఉపయోగకరమైన ఇంధనం అందుతుందని ఆయన వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బంగారం మాయం.. విలువ రూ.186కోట్లు