Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బంగారం మాయం.. విలువ రూ.186కోట్లు

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బంగారం మాయమైంది. కేరళలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయంలో సంపదకు ఏమాత్రం కొదవలేదు. ఆరు నేలమాళిగల్లో భారీగా నగలు, నగదు ఉన్నట్లు గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బంగారం మాయం.. విలువ రూ.186కోట్లు
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (16:27 IST)
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బంగారం మాయమైంది. కేరళలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయంలో సంపదకు ఏమాత్రం కొదవలేదు. ఆరు నేలమాళిగల్లో భారీగా నగలు, నగదు ఉన్నట్లు గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేరళలోని ఈ పద్మనాభుడి ఆలయంలో రూ. 186 కోట్ల విలువ చేసి బంగారం అదృశ్యమైంది. దీంతోపాటు, ఆలయంలో భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలు, అవినీతి చోటుచేసుకుంటున్నదని మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌రారు సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రత్యేక నివేదికలో పేర్కొన్నారు. 
 
2015 అక్టోబరులో నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు రారును ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వాల్యూమ్‌లు, ఐదు భాగాలతో ఉన్న వెయ్యి పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు రారు సోమవారం సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. శుద్ధీకరణ పేరుతో 769 బంగారు కలశాలను మాయం చేశారు. వీటి విలువ సుమారు రూ.186 కోట్లు ఉంటుంది. దీంతోపాటు, రూ. 14.18 లక్షల విలువ చేసే వెండి కూడా మాయమైనట్టు రారు పేర్కొన్నారు.

దేవాలయ ట్రస్టు 2.11 ఎకరాల భూమిని 1970 అక్రమంగా అమ్మేసిందని, ఇందుకు సంబంధించి రికార్డులేవీ లేవని తెలిపారు. ఆలయ నిర్వహణలో అవకతవకలు జరగడంతో ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని వినోద్ రారు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నబిడ్డ తల్లి పోలికను కలిగివుండకపోవడంతో.. దొంగనుకుని చితకబాదేశారు..