Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

6700 మెరుపులు, 2 గంటల పాటు భారీ వర్షం.. అతలాకుతలమైన టర్కీ

టర్కీ దేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్‌తో పాటు టర్కీలోని పలు నగరాలు వరదలో మునిగిపోయాయి. దీంతో ఆ దేశ ప్రజల

6700 మెరుపులు, 2 గంటల పాటు భారీ వర్షం.. అతలాకుతలమైన టర్కీ
, గురువారం, 20 జులై 2017 (13:32 IST)
టర్కీ దేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్‌తో పాటు టర్కీలోని పలు నగరాలు వరదలో మునిగిపోయాయి. దీంతో ఆ దేశ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఇస్తాంబుల్, సిలివ్రీ నగరాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఆ ప్రాంతంలోని ఇళ్లు నీటమునిగాయి. 
 
కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనరాకపోలు బంద్ అయ్యాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు నివాసాలు నీట మునగడంతో ప్రజలు డాబాలపై భారీగా కురుస్తున్న వర్షంలో తడుస్తూ గడుపుతున్నారు. హెలికాప్టర్ ద్వారా సహాయక పనులు జరుగుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా 6,700 మెరుపులు నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయం... రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కేస్తారో తెలుసా?