Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఎస్ టెర్రరిస్టులు నా చేతులో దొరికితే పిడి గుద్దులతో చంపేస్తా.. సైన్యంలో చేరి అంతు చూస్తా: సాజద్

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బంగ్లాదేశ్‌ల్లో ఐఎస్ దాడులు పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు తన చేతిలో దొరికితే పిడి గుద్దులతో చంపేస్తానని కండలవీరుడు, ఇతని పేరు సాజద్ ఘరీబీ ప్రకటించాడు

Advertiesment
Real Life Iranian Hulk : Sajid Gharibi aka Persian Hercules Images Photos
, మంగళవారం, 5 జులై 2016 (09:20 IST)
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బంగ్లాదేశ్‌ల్లో ఐఎస్ దాడులు పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు తన చేతిలో దొరికితే పిడి గుద్దులతో చంపేస్తానని కండలవీరుడు, ఇతని పేరు సాజద్ ఘరీబీ ప్రకటించాడు. తనకు 24 సంవత్సరాలే అయినప్పటికీ బరువు మాత్రం 155 కిలోలు ఉంటాడు. భారీ శరీరంతో దాదాపు హల్క్ మాదిరే ఇరానీ హెర్కులెస్ ఉన్నాడు. 
 
ప్రస్తుతం ఇతను నివసించే ఇరానీ దేశీయ సైనికులకు, ఐఎస్ ఉగ్రవాదులకు పోరుతో అనేక మంది సైనికులు, ప్రజలు మృతి చెందుతున్నారు. దీనిని ఏమాత్రం సహించలేని బాహుబలి సాజద్ తన దేశంలో మళ్లీ శాంతి నెలకొనాలనుకుంటున్నాడు. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ఐఎస్‌ను అంతం చేయక తప్పదన్నాడు. దీనికోసం ఇరానీ సైన్యంలో చేరతానని తెలిపాడు. యుద్ధభూమిలో సైనికులతో కలిసి ఐఎస్ అంతుచూస్తానంటున్నాడు. 
 
తన కోరికను వెల్లడిస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో అతను పోస్ట్ చేసిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 180 కిలోల బరువును అమాంతం ఎత్తి అవతల పారేయగల ఈ కండలవీరుడు సాజద్‌కి లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే భారీకాయుడు కావడంతో అతనికి సైన్యంలో చోటు కల్పిస్తారా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్తు బిస్కట్లు ఇచ్చి తల్లీకూతుళ్ళపై లైంగిక దాడి.. ఫోటోలు తీసి వికృతానందం.. నకిలీబాబా లీలలు!