Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరుగుదొడ్డికెళితే ప్రైవేట్ పార్ట్‌లో కాటేసిన కొండచిలువ.. ఎలా?

మరుగుదొడ్డికెళితే ప్రైవేట్ పార్ట్‌లో కాటేసిన కొండచిలువ.. ఎలా?
, శనివారం, 28 మే 2016 (09:45 IST)
టాయిలెట్‌కి వెళ్లిన ఓ వ్యక్తిని కొండచిలువ చెప్పరానిచోట కాటేసింది. ఈ సంఘటన థాయ్‌లాం‌డ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అట్టాపోర్న్‌ బూన్‌మాక్‌ఛౌ (38) అనే వ్యక్తి మరుగుదొడ్డి కోసం తన టాయిలెట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో టాయ్లెట్ బౌల్ వెనకాల దాక్కున్న ఓ 10 అడుగుల కొండచిలువ అతనిని కాటేసి ప్లంబింగ్‌లోకి వెళ్లిపోయింది. అతడిని ఎక్కడ కాటేసిందో తెలిస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాదు. 
 
అతని ప్రైవేట్ పార్ట్లో కరిచి అతనికి చుక్కలు చూపించింది. అతని కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే ఆంబులెన్స్‌ని పిలిపించారు. అతడికి వైద్యం అందించిన వైద్యులు అతడు కోలుకుంటున్నాడని, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని తెలిపారు. అటవీశాఖవారు అతడి ఇంటికి చేరుకుని ప్లంబింగ్‌లో దాగివున్న కొండచిలువను బయటకు తీశారు. అంతేకాదు ఇంత దీనస్థితిలో కూడా బెడ్పై పడుకుని నవ్వుతూ థాయ్ మీడియాకు ఫోటోకు ఫోజులిస్తున్న అతడిని చూసి అందరూ నివ్వెరపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ అనుమానాస్పద మృతి