పెళ్లయిన వ్యక్తితో అక్రమంగా ఓ ఎన్నారై యువతి లైంగిక సంబంధం పెట్టుకుంది. ఇండియానా రాష్ట్రంలో నివసించే పూర్వీ పటేల్ అనే 33 యేళ్ల ఇండో- అమెరికన్ మహిళ... తన కోవర్కర్‌తో లవ్‌లో పడి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఇంట్లో వాళ్లకి తాను గర్భవతి అని తెలిస్తే తల్లిదండ్రులు తన అసహ్యించుకుంటారని దీంతో ఎలాగైనా గర్భాన్ని తొలగించాలనుకుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ద్వారా గర్భాన్ని తొలగించే మందులను ఆర్డర్ చేసి తెప్పించుకుంది.
ఇంట్లో ఎవరు లేని సమయం చూసి మందులతో బాత్రూమ్‌లో గర్భాన్ని తొలగించింది. వెంటనే నేరుగా ఆసుపత్రికి వెళ్లకుండా ఆ ఒకటిన్నర పౌండ్ బరువున్న ఆ పిండాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి దాన్ని ఓ చెత్తకుండీలో పారేసి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లింది. అప్పటికి పూర్వీ పటేల్‌కు ఇంకా రక్తస్రావం జరుగుతూనే ఉంది. ఎమర్జన్సీ రూమ్‌లో డాక్టర్లు ఆమెకు వైద్య చికిత్సలు చేసినప్పటికీ తన గర్భంలోనే పిండాన్ని చిదిమేసిందనే ఆరోపణపై ఆమె మీద కేసు నమోదైంది. కొద్ది రోజుల తర్వాత పిండాన్ని గమనించిన పనిమనుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫోటోల సహాయంతో పూర్వీని గుర్తించారు.
అంతేకాక ఆమె ఆన్‌లైన్ ద్వారా గర్భం పోగోట్టే మందులు కొనుగోలు చేసినట్టు తేలింది. దీంతో పూర్వీపై కేసు పోలీసులు కేసు నమోదుచేశారు. అనంతరం పోలీసులు పూర్వీని కోర్టులో హాజరుపరిచారు. కానీ విచారణకు కోర్టులో వచ్చిన పూర్వీ తన గర్భం.. తన ఇష్టమంటూ కోర్టులో వాదించింది. అయితే వ్యక్తుల ఇష్టాయిష్టాలతో చావుకు సంబంధం లేదని, పౌరులకు జీవించే హక్కును ఎవరూ తమంతట తాముగా తొలగించుకోకూడదని కోర్టు వెల్లడించింది. విచారణలో ఆమెను నిందితురాలుగా పేర్కొంటూ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.