Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియలు.. ఇంతటి అవమానం జరిగిందా?

Prince Harry
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (15:46 IST)
Prince Harry
రాణి ఎలిజబెత్‌-2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్‌-3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు.
 
కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన 'ఈఆర్‌'ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్‌ చిహ్నం అలాగే ఉంచారు. 
 
ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. 
 
రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్‌ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు.
 
దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ''నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. 
 
ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్‌-2 కుమారుడు ప్రిన్స్‌ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు.
 
కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది'' అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్‌ కథనం పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాచకురాలు ప్రసవం నొప్పులు.. పురుడు పోసిన కానిస్టేబుల్