Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్ : హిల్లరీ, ట్రంప్‌ల మాటల యుద్ధం.. ట్రంప్ అధ్యక్షుడైతే సహకరిస్తా...

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ప్రారంభమైన ఈ చర్చ వాడివేడిగా సాగుతో

అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్ : హిల్లరీ, ట్రంప్‌ల మాటల యుద్ధం.. ట్రంప్ అధ్యక్షుడైతే సహకరిస్తా...
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:52 IST)
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ప్రారంభమైన ఈ చర్చ వాడివేడిగా సాగుతోంది. మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా తలపడుతున్న వీరిద్దరు పలు అంశాలు, సమస్యలను ప్రస్తావించారు. అమెరికా దశదిశ, ప్రజల భద్రత, శ్రేయస్సు అంశాలపై చర్చ జరుగుతోంది. 
 
ఇందులో తొలుత హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ... దృఢమైన, స్థిరమైన అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. నిర్మాణరంగం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ఉద్యోగ వృద్ధి సాధించామన్నారు. తాను అధికారంలోకి వస్తే కార్పొరెట్ లొసుగులు తొలగిస్తానని హామీ ఇచ్చారు. సంపన్నులకు పన్ను తగ్గింపులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను సమర్థంగా ఎదుర్కొంటానని హామీ ఇచ్చారు. అలాగే, ట్రంప్ అధ్యక్షుడైతే ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 
 
అలాగే, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చైనా, మెక్సికో, భారత్ వంటి దేశాలు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతుని, వీటికి కళ్లెం వేయాల్సి ఉందన్నారు. కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సిన అవసరముందని, అప్పుడే కొత్త సంస్థలు వస్తాయని అభిప్రాయపడ్డారు. హిల్లరీకి ఎలాంటి ప్రణాళిక లేదని తూర్పారబట్టారు. గత 30 ఏళ్లలో హిల్లరీ ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్‌పైనా పోరాటం చేయలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిజర్వాయర్లలో నీళ్లు లేవు... అవి మాకేచాలవు... తమిళనాడుకేమిస్తాం?: కర్ణాటక