Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబుదాబిలో 11ఏళ్ల కుర్రాడిపై లైంగిక దాడి.. హత్య.. వీడియో రిలీజ్

అబుదాబిలో 11 ఏళ్ల బాలుడు లైంగిక దాడితో పాటు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. అబుదాబిలోని ఓ మసీద్‌లో అజన్ మజీద్ జన్‌జువా అనే 11 ఏళ్ల కుర్రాడు మధ్యాహ్నం పూట నమాజ్ కో

Advertiesment
అబుదాబిలో 11ఏళ్ల కుర్రాడిపై లైంగిక దాడి.. హత్య.. వీడియో రిలీజ్
, శుక్రవారం, 16 జూన్ 2017 (11:21 IST)
అబుదాబిలో 11 ఏళ్ల బాలుడు లైంగిక దాడితో పాటు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. అబుదాబిలోని ఓ మసీద్‌లో అజన్ మజీద్ జన్‌జువా అనే 11 ఏళ్ల కుర్రాడు మధ్యాహ్నం పూట నమాజ్ కోసం వచ్చాడు. 
 
అయితే ఆ పిల్లాడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ కుర్రాడి అర్ధనగ్న మృతదేహాన్ని గత 31వ తేదీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కుర్రాడు లైంగిక దాడికి గురైనట్లు తేల్చారు. 
 
తాజాగా పోలీసులు విడుదల చేసిన వీడియోలో బుర్ఖా ధరించిన ఓ మహిళ.. కుర్రాడిని లిఫ్టులో తీసుకెళ్తుంది. ఆమెతో మరో వ్యక్తి కూడా వెళ్తున్నాడు. కుర్రాడు అదృశ్యం కావడానికి కొన్ని గంటల ముందే ఈ వీడియో రికార్డ్ అయ్యిందని.. బుర్ఖా ధరించింది మహిళ కాదని.. పోలీసులు అనుమానిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపకు 2, పన్నీరుసెల్వంకు 60... దినకరన్‌కు 20.. ఏంటి..?