నవాజ్ షరీఫ్‌పై కేసు.. ప్రజలను రెచ్చగొట్టి.. సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించారట..
పాకిస్థాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ చరిత్రలో మొత్తం 70 సంవత్సరాల్లో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినంద
పాకిస్థాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ చరిత్రలో మొత్తం 70 సంవత్సరాల్లో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినందుకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ అయిన ఐఎం పాకిస్థాన్ పార్టీ ఛైర్మన్, న్యాయవాది ఇష్తియాక్ అహ్మద్ మీర్జా రావల్పిండిలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులో తనకు వాట్సాప్ ద్వారా ఓ వీడియో అందిందని.. అందులో ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతున్నట్లుందని చెప్పారు. ఆయన మాటలు ప్రజలను రెచ్చగొట్టేలా.. సైనిక దళాల మీద విద్వేషాన్ని సృష్టించేలా ఉన్నాయన్నారు. అందుకే పీఎంఎల్ఎన్ పార్టీ అధినేత, పాక్ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రధానిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు కాలేదు. స్థానికంగా దాన్ని ''రోజ్‌నామ్చా" అంటారని పాకిస్థాన్ పత్రిన డాన్ తెలిపింది.