Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధ్రువపు ఎలుగుబంట్లు.. స్లెడ్ డాగ్‌ను తలపై ప్రేమగా నిమిరితే అర్థమేమిటో తెలుసా?

ప్రపంచంలో జరుగుతున్న ఆశ్చర్యపోయే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెకన్లలో ప్రత్యక్షమవుతున్న సంగతి తెలిసిందే. కెనడాలోని చర్చిల్ పట్టణం ధ్రువపు ఎలుగుబంట్లకు పేరుంది. వాటిని చూసేందుకు అనేకమంది సందర్శకుల

ధ్రువపు ఎలుగుబంట్లు.. స్లెడ్ డాగ్‌ను తలపై ప్రేమగా నిమిరితే అర్థమేమిటో తెలుసా?
, బుధవారం, 23 నవంబరు 2016 (16:46 IST)
ప్రపంచంలో జరుగుతున్న ఆశ్చర్యపోయే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెకన్లలో ప్రత్యక్షమవుతున్న సంగతి తెలిసిందే. కెనడాలోని చర్చిల్ పట్టణం ధ్రువపు ఎలుగుబంట్లకు పేరుంది. వాటిని చూసేందుకు అనేకమంది సందర్శకులు తరలివస్తుంటారు. వాటిని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

ఈ సరదానే ఓ వ్యక్తి సంపాదనా మార్గంగా మలచుకున్నాడు. స్లెడ్‌ డాగ్స్‌ను ఎరగా చూపించి ధ్రువపు ఎలుగుబంట్లను బయటకు రప్పిస్తాడు. ఆ విషయం తెలియని పర్యాటకులు అవి సహజంగానే వస్తున్నాయనుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ సంఘటనతో ఈ వ్యవహారం బట్టబయలైంది. జంతుప్రేమికులు పలువురు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
 
తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ ధ్రువపు ఎలుగుబంటి పక్కనే కట్టేసివున్న స్లెడ్‌ డాగ్‌ తలపై ప్రేమగా నిమురుతూ కనిపించింది. ఈ వీడియో చూసినవారైనా ముచ్చటపడతారు. మూగజీవాలకు కూడా మనుషుల్లాగే ప్రేమ, ఆప్యాయతలు తెలుసనుకుంటారు.

కానీ ఆ వీడియో వెనుక జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే. అదేంటంటే.. ధ్రువపు ఎలుగుబంటి అలా ప్రేమగా తలపై నిమురుతుందంటే.. దానికి అర్థం.. ఆ జీవి తాను ఆహారంగా తీసుకోవడానికి పనికి వస్తుందా లేదా అని పరీక్షించడమే. దీంతో చాలామంది స్లెడ్ డాగ్స్‌ను పంపిన వ్యక్తిపై మండిపడుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరాయి పురుషునితో రాసలీలలు.. అడ్డొస్తున్నాడని కొడుకునే కడతేర్చిన తల్లి