పిజ్జా తింటుండగా లాక్కెళ్లాడు.. 17ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు.. పొట్టలో కత్తితో పొడిచాడు..!
దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలు, యువతులు అనే తేడా లేకుండా అమ్మాయి ఎక్కడ కనబడితే అక్కడ అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నెన్
దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలు, యువతులు అనే తేడా లేకుండా అమ్మాయి ఎక్కడ కనబడితే అక్కడ అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా రెస్టారెంట్‌కు పిజ్జా తినేందుకు వచ్చిన అమ్మాయిపై అత్యాచారంతో పాటు పొట్టలో కత్తితో పొడిచాడో దుర్మార్గుడు. ఈ ఘటన లండన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జనసంచారం అధికం ఉండే ఎప్సమ్ రెస్టారెంట్లోకి 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి వచ్చింది. పిజ్జా తింటుండగా 32 ఏళ్ల వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లాడు. దారుణంగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా కడుపులో కత్తితో పొడిచాడు. ఈ కామాంధుడిని అడ్డుకున్న రెస్టారెంట్ సిబ్బందిపై కూడా అతడు దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 17 ఏళ్ల అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్ర గాయాలైనా ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.
దీనిపై డిటెక్టిక్ ఇన్‌స్పెక్టర్ నిక్ చాంబర్స్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళిక ప్రకారం 32 ఏళ్ల దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని చెప్పారు. బాధితురాలు, నిందితుడు పరస్పరం తెలిసినవారేనని చాంబర్స్ వెల్లడించారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.