Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒళ్లొంచి పనిచేయడంలో తేడాలే ఊబకాయానికి అసలైన వనరు

అమెరికాలో సగటున ప్రజలు ప్రతిరోజూ 4,700 మెట్లు ఎక్కుతారట. మెక్సికోలో కూడా ప్రజలు సగటున రోజూ 4,700 మెట్లే ఎక్కుతారట. కానీ మెక్సికోలో కంటే అమెరికాలోనే ఊబకాయులు సంఖ్య అధికంగా ఉంది. మెక్సికిలో ఊబకాయుల శాతం 18.1 కాగా అమెరికాలో 27.7 శాతంగా ఉంది. ఎందుకు?

ఒళ్లొంచి పనిచేయడంలో తేడాలే ఊబకాయానికి అసలైన వనరు
హైదరాబాద్ , శుక్రవారం, 14 జులై 2017 (08:30 IST)
అమెరికాలో సగటున ప్రజలు ప్రతిరోజూ 4,700 మెట్లు ఎక్కుతారట. మెక్సికోలో కూడా ప్రజలు సగటున రోజూ 4,700 మెట్లే ఎక్కుతారట. కానీ మెక్సికోలో కంటే అమెరికాలోనే ఊబకాయులు సంఖ్య అధికంగా ఉంది. మెక్సికిలో ఊబకాయుల శాతం 18.1 కాగా అమెరికాలో 27.7 శాతంగా ఉంది. ఎందుకు? దీనికి తక్షణం చెప్పే సరైన సమాధానం ఏదంటే ఫుడ్ కల్చర్ అనే వస్తుంది. ఆహార అలవాట్లే ఊబకాయం పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది అందరూ ఆమోదించే వాస్తవం. 
 
కానీ తాజాగా నేచుర్ పత్రికలో వచ్చిన ఒక వ్యాసం శారీరక శ్రమ చేయడంలో పాటిస్తున్న అసమానతలే మనుషులు లావెక్కడానికి ప్రధాన కారణం అని చెబుతోంది.  అమెరికాలో చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే శారీరక పనిని ప్రతి రోజూ చేస్తున్నారని, మెజారిటీ ప్రజలు రోజులో ఎలాంటి శారీరక శ్రమా చేయలేదని ఈ వ్యాసం తెలిపింది. అదే జపాన్‌లో అయితే జనాభాలో ఎక్కువమంది శారీరక శ్రమ చేయడంలో సమానులుగా ఉన్నారట.
 
యాక్టివిటీ ఇనీక్వాలిటీ అంటే శరీర కష్టం చేయడంలో అసమానత ఊబకాయాన్ని పెంచుతోందని ఇప్పుడిప్పుడే అమెరికాలో చర్చల్లో తేలుస్తున్నారు. గతంలోనూ శరీర కష్టానికి, ఊబకాయానికి మధ్య సంబంధాన్ని గురించి చర్చించేవారు కానీ సమాజంలో మెజారిటీ ప్రజలు ఊబకాయం బారిన పడుతున్నారంటే వారు శారీరక శ్రమ ఏమాత్రం చేయకపోవడమే కారణమని కేవలం ఆహార అలవాట్లే ఊబకాయాన్ని సృష్టించవని తాజా అంచనాలు వెలువరిస్తున్నారు. 
 
ఇన్ని గంటలు మేం వ్యాయామం చేస్తున్నామని, రోజుకు సగటున ఎంత సేవు వ్యాయామం చేస్తున్నామో స్మార్ట్ ఫోన్‌లో కూడా ట్రాక్ చేస్తున్నామని అమెరికాలోనే కాకుండా చాలా దేశాల్లో జనం చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ రకరకాల శారీరక శ్రమలు చేయకుండా కేవలం వ్యాయామం ద్వారా ఊబకాయాన్ని అదుపు చేయవచ్చు అనేది భ్రమేనని తాజా అంచనాలు చెబుతున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్‌కార్డు నిబంధనలను ఎత్తివేతకు అమెరికన్ కాంగ్రెస్ నేతల డిమాండ్.. భారత్‌కు మేలు