Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిమ్ జోంగ్ పిచ్చోడు.. చెత్త నా.... తిట్టిపోసిన పిలిప్పీన్స్ అధ్యక్షుడు

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్‌పై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత అధికమవుతోంది. నిన్నటికి నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక కిమ్ జోంగ్ వ్యవహారాలను సహించలేదనగా, తాజాగా పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో

Advertiesment
Philippines
, గురువారం, 3 ఆగస్టు 2017 (09:25 IST)
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్‌పై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత అధికమవుతోంది. నిన్నటికి నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక కిమ్ జోంగ్ వ్యవహారాలను సహించలేదనగా, తాజాగా పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కిమ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనో పిచ్చోడని, చెత్త నా.. తిట్టిపోశారు.

కిమ్ ప్రమాదకరమైన బొమ్మలతో ఆడుతున్నాడని దుయ్యబట్టారు. పాలబుగ్గలతో ఉన్నట్టు కనిపించే.. ''బిచ్''కు పుట్టినోడని ధ్వజమెత్తారు. కిమ్ పొరపాటు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని.. అణు యుద్ధ వాతావరణాన్ని తక్షణం ఆపాల్సిందేనని రోడ్రిగో హెచ్చరించారు 
 
ఉత్తర కొరియా దీర్ఘకాలిక క్షిపణుల పరీక్షలపై ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అంతర్జాతీయ సమావేశం జరగడానికి కొన్ని రోజుల ముందు రోడ్రిగో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంకా ఉత్తర కొరియాతో సంబంధాలున్న అన్ని దేశాల మంత్రులు వచ్చే వారం మనీలాలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి పరీక్షలపై చర్చించనున్నారు. అమెరికాను తాకగలిగే అణు క్షిపణిని అభివృద్ధి చేసే పనిలో నార్త్ కొరియా ఉందని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు లేవు.. పవన్‌తో సత్సంబంధాలున్నాయ్: నారా లోకేశ్