Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ లో పెట్రోల్ ధర లీటరుకి రూ.20 తగ్గింపు!

Advertiesment
పాకిస్థాన్ లో పెట్రోల్ ధర లీటరుకి రూ.20 తగ్గింపు!
, శుక్రవారం, 1 మే 2020 (15:51 IST)
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పాక్ లోని ‘డాన్’ పత్రిక కథనం ప్రకారం, లీటర్ పెట్రోల్ ధరను రూ.20 వరకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని ఆ కథనంలో పేర్కొంది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తో చర్చించిన తర్వాతే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ‘డాన్‘ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ వారధిపై వాహన రాకపోకలు నిలిపివేత