పంచాయతీ తీర్పు.. మైనర్ బాలికపై కుటుంబ సభ్యుల సమక్షంలో రేప్...
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోని ఓ గ్రామ పంచాయతీ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే తీర్పునిచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడిని తమ చేతల ద్వారా నిజం చేస్తూ అత్యాచారానికి ప్రతీకారంగా అత్యాచారమే చేయి
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోని ఓ గ్రామ పంచాయతీ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే తీర్పునిచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడిని తమ చేతల ద్వారా నిజం చేస్తూ అత్యాచారానికి ప్రతీకారంగా అత్యాచారమే చేయించింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
ముజఫ్ఫరాబాద్‌లోని రాజ్‌పుర్ గ్రామంలో తన సోదరిని అత్యాచారం చేశాడంటూ ముహల్లేకు చెందిన ఒక యువకుడు పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సమావేశమై చర్చించిన తర్వాత పంచాయతీ అధ్యక్షుడు.. అత్యాచార బాధితురాలి సోదరుడు.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుని సోదరిని రేప్ చేయాలని ఆదేశించారు.
దీంతో 16 యేళ్ళ బాలికపై కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈ ఘటనకు కారకులైన 20 మందిని అరెస్టు చేసినట్టు ముల్తాన్ మండలానికి చెందిన పోలీసు అధికారి అహ్‌సాన్ తెలిపారు. ఇటువంటి ఆదేశాలు జారీచేసిన పంచాయతీ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.