Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాక్‌పిట్‌లో చైనీస్ మహిళతో పైలట్ రాసలీలలు.. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ పైలట్ నిర్వాకం... (Video)

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్లు ప్రయాణికుల ప్రాణాలు గాల్లోకి వదిలివేసి.. తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టి పైలట్

Advertiesment
Pakistani pilot
, బుధవారం, 10 మే 2017 (08:04 IST)
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్లు ప్రయాణికుల ప్రాణాలు గాల్లోకి వదిలివేసి.. తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టి పైలట్ ఏకంగా బిజినెస్ క్లాస్‌లో పడుకుని ఏకంగా రెండున్నర గంటల పాటు నిద్రపోయాడు. ఈ పైలట్ నిర్వాకం ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బయటపడింది. 
 
ఇపుడు మరో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కే చెందిన మరో పైలట్.. ఓ ప్రయాణికురాలితో కాక్‌పిట్‌లో రాసలీలల్లో నిమగ్నమయ్యాడు. టోక్యో నుంచి బీజింగ్ వెళ్లే పీకే-853 విమానం ఇస్లామాబాద్ నుంచి బీజింగ్‌కు టేకాఫ్ అయిన కాసేపటికే... కాక్‌పిట్‌లోని సిబ్బందినంతటినీ బలవంతంగా బయటకు పంపేసిన పైలట్, చైనాకు చెందిన ఒక ప్రయాణికురాలిని కాక్‌‌పిట్‌‌లోనికి రప్పించుకున్నాడు. 
 
అనంతరం విమానం గాల్లో ఉండగా, వారిద్దరూ ఏకాంతంగా మైకంలోకెళ్లిపోయారు. అలా 2 గంటలపాటు విమానం ప్రయాణించగా... విమానం ల్యాండ్ అయిన తర్వాత కానీ ఆమె తిరిగి బయటకు రాలేదని విమాన సిబ్బంది పాటు ఇతర ప్రయాణికులు చెపుతు్నారు. నిజానికి ఎయిర్ లైన్స్ నిబంధనల ప్రకారం కాక్‍పిట్‌ లోపలికి ఎవరూ వెళ్లకూడదు. కానీ, పాకిస్థాన్ పైలట్లు ఈ నిబంధననలు తుంగల్లో తొక్కి... ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనియా గాంధీకి ఫుడ్ పాయింజనింగ్.. గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్