Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళతో సోదరుడు వివాహేతర బంధం... సోదరిని నగ్నగా ఊరేగించారు

దాయాది దేశం పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువకుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆ యువకుడి సోదరిని వివస్త్రను చేసి ఊరేగించారు. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్ప

Advertiesment
naked parad
, శుక్రవారం, 3 నవంబరు 2017 (09:23 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువకుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆ యువకుడి సోదరిని వివస్త్రను చేసి ఊరేగించారు. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు మేరకు ఆ బాలికను నగ్నంగా ఊరేగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో ఆ యువకుడిని, మహిళను దండించాల్సిన గ్రామపెద్దలు.. యువకుడి సోదరిని శిక్షిస్తూ తీర్పునిచ్చింది. సోదరుడు చేసిన తప్పుకు 14 ఏళ్ల యవసున్న అతని చెల్లెని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పింది.
 
తాజా ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాధిత బాలిక సోదరుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహిళ బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా, ఈ తరహా తీర్పును ఇచ్చారని తెలిపారు. 
 
ఫలితంగా గత నెల 27వ తేదీన బాలికకు స్థానం చేయించిన గ్రామస్తులు ఆమె దుస్తులను బలవంతంగా విప్పించి గంటపాటు ఊరంతా తిప్పుతూ ఊరేగించారు. దేశంలో ఈ ఘటన ప్రకంపనలు సృష్టించడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
కాగా, ఉగ్రవాదానికి, అరాచకానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌ దేశంలో గిరిజన చట్టాలకు సమాంతరంగా నడిచే గ్రామీణ చట్టాలు అమలవుతున్న విషయం తెల్సిందే. ఫలితంగా ‘పరువు’ పేరుతో ప్రతి ఏడాది వందలాది మంది మహిళల ప్రాణాలను ఈ చట్టాలు తీసేస్తున్నాయి.
 
గతంలో కూడా మూడు నెలల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి సోదరుడిని అందరూ చూస్తుండగా రేప్ చేయాలంటూ విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు... బిల్ గేట్స్ వస్తున్నారు...