Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశం పరువు తీశావంటూ దౌత్యవేత్తపై పాకిస్థానీల తిట్లదండకం...

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ వైఖరిని అంతర్జాతీయసమాజం ముందు ఎండగట్టాలని చూసిన పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోధీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె చూపిన అత్యుత్సాహంతో ఆమె అభాసుపాలైంది.

Advertiesment
Pakistani diplomat Maleeha Lodhi
, సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:15 IST)
ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ వైఖరిని అంతర్జాతీయసమాజం ముందు ఎండగట్టాలని చూసిన పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోధీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె చూపిన అత్యుత్సాహంతో ఆమె అభాసుపాలైంది. గాజాలో గాయపడిన ఓ యువతి చిత్రాన్ని చూపుతూ, ఆమె కాశ్మీర్‌లో మహిళల పరిస్థితి ఇదని ప్రకటించి అభాసుపాలుకాగా, దేశం పరువు తీశావంటూ, పాక్ దేశవాసులు ఆమెపై తిట్ల దండకానికి దిగారు. వెంటనే ఆమెను దౌత్యాధికారి పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లూ ఊపందుకున్నాయి. 
 
ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో గాయపడిన రవయ అబు జోమా అనే యువతి ఫోటోను 2014లో హీదీ లెవిన్ అనే ఫోటోగ్రాఫర్ తీయగా, దీనికి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. ఈ విషయాన్ని గుర్తించలేకపోయిన పాక్ దౌత్యవేత్త మలీహా, అదే ఫోటో ప్రింట్‌ను ఐరాసలో చూపిస్తూ, కాశ్మీర్‌లో యువతులపై భారత సైన్యం అకృత్యాలు జరుపుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో విమర్శలు చేసింది. ఆమె ప్రసంగం ముగిసేలోపే ఈ ఫోటో కాశ్మీర్ యువతిది కాదని నెటిజన్లు తేల్చేశారు. 
 
దీనిపై పాకిస్థాన్ పౌరులతో పాటు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక దేశానికి ఐరాసలో ప్రతినిధిగా ఉన్న లోధీ.. అంతర్జాతీయ అంశాలపై ఏమాత్రం అవగాహనలేదని ఈ ఫోటోతో తేలిపోయిందంటున్నారు. పైగా, ఆమె చేసిన పని కారణంగా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ పరువు పోయిందని, తమ దేశం చెప్పే అన్ని అంశాలూ ఇలాగే అసత్యాలని నమ్మే పరిస్థితులు వచ్చాయని ఆ దేశ వాసులు సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు. అసలు ఎన్నో అవార్డులు అందుకున్న మూడేళ్ల నాటి ఫోటోను గుర్తించలేకపోయిన ఆమె, తాను ఓ దేశానికి ప్రతినిధినన్న విషయాన్ని మరచి చౌకబారు ప్రసంగం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాములు రైతును పగబట్టాయి.. ఏకంగా 34సార్లు కాటేశాయి..