Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త నోట్లను కాపీ కొట్టడం కుదరదు.. పాకిస్థాన్‌కు మోడీ గట్టి షాకే ఇచ్చారు.. నిఘా వర్గాలు

రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త నోట్లు చెలామణికి వచ్చేశాయి. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రూ.2 వేలు, రూ.5 వందల నో

కొత్త నోట్లను కాపీ కొట్టడం కుదరదు.. పాకిస్థాన్‌కు మోడీ గట్టి షాకే ఇచ్చారు.. నిఘా వర్గాలు
, గురువారం, 10 నవంబరు 2016 (11:26 IST)
రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త నోట్లు చెలామణికి వచ్చేశాయి. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రూ.2 వేలు, రూ.5 వందల నోట్లను కాపీ చేయడం అసాధ్యమని ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చేశాయి. కొత్త నోట్ల తరహాలో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడం అంత సులభమైన పని కాదని ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. 
 
తద్వారా దొంగ నోట్ల ప్రింట్ చేసే దుండగులకు ఆటకట్టినట్టేనని అధికారులు వెల్లడించారు. అలాగే పాకిస్థాన్, అది ప్రేరేపిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమైన పని అని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా), ఇంటెలిజెన్స్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కొత్తనోట్లను పరిశీలించిన అనంతరం నకిలీ నోట్లను ముద్రించడం అంత సులభం కాదని తేల్చేసింది. 
 
భారత కరెన్సీని ప్రింట్ చేసేందుకు పాకిస్థాన్ పెషావర్లో ప్రెస్‌నే ఏర్పాటు చేసిందని.. అందులో ప్రస్తుతం రద్దు చేసిన పెద్ద నోట్లను ముద్రించి.. నకిలీ కరెన్సీని పాక్ గూడఛార సంస్థ అయిన ఐఎస్ఐ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తాయిబా, ఇతర ఉగ్రవాద సంస్థలకు అందిస్తుంది. వారి ద్వారా భారతదేశంలోకి వాటిని చొప్పించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని పాకిస్తాన్ కుట్ర పన్నుతోంది. ఇందుకే మోడీ పెద్ద నోట్ల రద్దు ద్వారా చెక్ పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల వద్ద భారీ క్యూ... ఫుల్ సెక్యూరిటీ... కొత్త నోట్ల పంపిణీ షురూ...