Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదం పిరికిపందల ఆయుధం మాత్రమే.. పాక్ 10 ముక్కలవుతుంది: రాజ్‌నాథ్ హెచ్చరిక

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే.. పరిస్థితి తారుమారవుతుందని హెచ్చరించారు. మతం ఆధారంగా భారత్‌ను విభజించాలని పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తు

ఉగ్రవాదం పిరికిపందల ఆయుధం మాత్రమే.. పాక్ 10 ముక్కలవుతుంది: రాజ్‌నాథ్ హెచ్చరిక
, ఆదివారం, 11 డిశెంబరు 2016 (16:43 IST)
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే.. పరిస్థితి తారుమారవుతుందని హెచ్చరించారు. మతం ఆధారంగా భారత్‌ను విభజించాలని పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని.. కానీ అది ఎన్నటికీ జరిగే ప్రసక్తే లేదని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో కథువాలోని రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. 
 
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాలుగుసార్లు భారత్‌పై పాకిస్థాన్‌ దాడికి దిగిందని, అన్నిసార్లు ఆ దేశానికి తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. '(1971లో) పాకిస్థాన్‌ రెండు దేశాలుగా చీలిపోయింది. ఒకవేళ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుంటే ఆ దేశం త్వరలోనే పదిముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది' అని రాజ్‌నాథ్‌ అన్నారు
 
ఉగ్రవాదం పిరికిపందల ఆయుధం మాత్రమేనని పాకిస్థాన్‌పై మండిపడ్డారు. సరిహద్దుల్లో ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినా ధీటుగా సమాధానం ఇస్తామని సవాల్ విసిరారు. ఉరీ ఉగ్రవాద దాడి అనంతరం భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను ప్రస్తావిస్తూ 'మా ప్రభుత్వం భారత్‌ను ఎవరి ముందు తలవంచుకోనివ్వదని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ ఎలాంటి దాడులు చేసినా వాటిని ధీటుగా తిప్పుకొడతామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెలాక్సీ నోట్ ఎస్7ఫోన్లలో కొత్త సాఫ్ట్‌వేర్.. 19నుంచి మూగబోతాయా?