ప్రతీకారం కోసం తపన : 26/11 తరహా దాడులకు పాకిస్థాన్ పక్కా ప్లాన్
భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ పాలకులు నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఆ దేశ ఆర్మీలు కలిసి 26/11 తరహా దాడులకు పాల్పడేందుక
భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ పాలకులు నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఆ దేశ ఆర్మీలు కలిసి 26/11 తరహా దాడులకు పాల్పడేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యూహరచనలో భాగంగా భారత రక్షణ వ్యవస్థ కీలక సమాచారాన్ని సేకరించేందుకే పాక్ హైకమిషన్ కార్యాలయ ఉద్యోగి మహ్మద్ అక్తర్‌ను నియమించినట్టు చెబుతున్నాయి.
ఈ విషయం అతడిని అరెస్టు చేసి విచారించిన పలు కీలక అంశాలను వెల్లడించినట్లు భద్రతాధికారులు తెలిపారు. అతడిని వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. భారత పశ్చిమ తీరం వెంబడి భద్రతాదళాల మోహరింపునకు సంబంధించిన కీలక సమాచారాన్ని అక్తర్ సేకరించాడు.
పాక్ హైకమిషన్ కార్యాలయంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురు అధికారుల పేర్లనూ వెల్లడించినట్లు సమాచారం. కాగా, మూడేళ్లుగా తాను అక్తర్‌తో సంబంధాలు కలిగివున్నట్టు జోధ్‌పూర్‌లో అరెస్టయిన ఉగ్రవాది సోహయిబ్ శుక్రవారం పోలీసుల విచారణలో వెల్లడించిన విషయం తెల్సిందే. ఇతను ఇచ్చిన సమాచారం మేరకు పాక్ దౌత్య సిబ్బందిని ఎన్.ఐ.ఏ అరెస్టు చేసింది.