Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత జలాంతర్గామి మా జలాల్లోకి వచ్చి గూఢచర్యం చేసింది: పాకిస్థాన్

నిబంధనలకు విరుద్ధంగా జలాంతర్గామి తమ జలాల్లోకి వచ్చి గూఢచర్యం చేసిందని.. తమ దేశంపై గూఢచర్యం చేస్తున్నారంటూ భారత్‌పై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. నిబంధనలకు అతిక్రమించి భార

Advertiesment
Pakistan to hand over dossier on India to new UN chief
, ఆదివారం, 1 జనవరి 2017 (15:09 IST)
నిబంధనలకు విరుద్ధంగా జలాంతర్గామి తమ జలాల్లోకి వచ్చి గూఢచర్యం చేసిందని.. తమ దేశంపై గూఢచర్యం చేస్తున్నారంటూ భారత్‌పై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. నిబంధనలకు అతిక్రమించి భారత జలాంతర్గామి తమ జలాల్లోకి వచ్చి గూఢచర్యం చేసిందని ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధి ఫిర్యాదు చేయనున్నారని పాక్ వెల్లడించింది. 
 
ఈ మేరకు రేపు ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న గుటేర్స్‌కు లోధీ ఫిర్యాదును అధికారికంగా అందిస్తారని సమాచారం. కాగా, నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను 2016 ప్రారంభంలో అరెస్ట్ చేసిన పాక్, తమ దేశంలో ఇండియా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. ఇరుదేశాల మధ్య సమస్యలను చర్చించుకోవడానికి రావాల్సిందిగా భారత్‌, పాకిస్థాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు. దక్షిణాసియా దేశాల్లో శాంతియుత పరిస్ధితులు ఉంటేనే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందని చెప్పిన ఆయన చర్చలకే భారత్‌-పాక్‌ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు నిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శత్రువులకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు : డొనాల్డ్ ట్రంప్