Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్జికల్ దాడులు జరగనేలేదు... జరిగివుంటే తిప్పికొట్టివుండేవాళ్లం : పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్

భారత ఆర్మీ నిజంగా తమ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ దాడులు జరపలేదని, ఒకవేళ అలాంటి దాడులు జరిగివుంటే ఖచ్చితంగా తమ దేశ ఆర్మీ తిప్పికొట్టివుండేదని పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు.

Advertiesment
Pakistan High Commissioner Abdul Basit
, గురువారం, 13 అక్టోబరు 2016 (11:07 IST)
భారత ఆర్మీ నిజంగా తమ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ దాడులు జరపలేదని, ఒకవేళ అలాంటి దాడులు జరిగివుంటే ఖచ్చితంగా తమ దేశ ఆర్మీ తిప్పికొట్టివుండేదని పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. సర్జికల్ దాడులపై ఆయన మరోమారు స్పందిస్తూ... గతనెల 29న నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి పలువురు ఉగ్రవాదులను భారత దళాలు హతమార్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అసలు సర్జికల్ దాడులంటూ ఏవీ జరగలేదన్నారు. అదే కనుక జరిగి ఉంటే పాక్ బలగాలు వెంటనే తిప్పికొట్టివుండేవన్నారు. 
 
ఇక భారత్‌కు చెందిన ఓ టెలివిజన్ చానల్ మిర్పూర్‌లోని పాక్ పోలీసు అధికారితో మాట్లాడినట్టు చెబుతున్నదంతా బూటకమన్నారు. అది పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేసిన సంభాషణ అని తేల్చి చెప్పారు. "అక్కడసలు సర్జికల్ స్ట్రయిక్స్ జరగనే లేదు. జరిగినవి కేవలం ఇరువర్గాల మధ్య కాల్పులే. ఆ ఘటనలోనే ఇద్దరు పాక్ సైనికులు మృతిచెందారు. నిజానికి భారత్ చెబుతున్నట్టు సర్జికల్ స్ట్రయిక్స్ కనుక జరిగి ఉంటే పాక్ వెంటనే వాటిని తిప్పి కొట్టేది. ఒక్క భారత సైనికుడు కూడా సరిహద్దు దాటలేదు" అని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాసిత్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రిలో పత్రికలు తిరగేస్తున్న జయలలిత... కోలుకున్నట్టేనా?