భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ
భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రవాద సంస్థల అగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెర
భారత ఆర్మీ చేతిలో ప్రాణహానికి జడిసి ఉగ్రవాద సంస్థల అగ్రనేతలకు పాకిస్థాన్ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపుదాడి జరిపిన విషయంతెల్సిందే. ఈ దాడులకు పాక్ ఆర్మీ బెంబేలెత్తి పోయింది.
ముఖ్యంగా లష్కర్ ఏ తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు నేతృత్వం వహిస్తున్న హఫిజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్‌లకు పాక్ ఆర్మీ రక్షణ పెంచింది. స్వయంగా వారిని తమ సైనిక స్థావరాల్లో భద్రత కల్పించింది. ఫోర్ కార్ప్స్ ఆర్మీ క్యాంప్‌లో వీరికి రక్షణ కల్పించారు.
భారత బలగాల మెరుపుదాడిలో లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చనిపోయారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఇద్దరు అగ్ర ఉగ్రవాద నేతలను పాక్ ఆర్మీ క్యాంపులకు మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత బలగాలు మళ్లీ కనుక మెరుపుదాడులు నిర్వహిస్తే వీరిద్దరికి ప్రాణహాని ఉంటుందని అనుమానించిన పాక్ ఆర్మీ వీరిని సురక్షిత స్థావరాలకు తరలించింది.