పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పరువు పోయింది. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్‌లో భాగంగా లో-దుస్తులు తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడమే ప్రధాన కారణమైంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆపై సదరు సంస్థ డ్రెస్ కోడ్‌పై తన నియమాలను వెనక్కి తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గురువారం పీఐఏ.. క్యాబిన్ సిబ్బంది కోసం ఒక ఆదేశం జారీ చేసింది. యూనిఫాం కింద లోదుస్తులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. లోదుస్తులు వేసుకుంటేనే డిగ్నిటీగా ఉంటుందని పేర్కొంది.
అంతే అక్కడి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిర్‌లైన్స్‌పై సొంత దేశంలోనే ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసేసుకుంది ఎయిర్‌లైన్స్.