కోడలిపై మామ అత్యాచారం.. కాల్చి చంపేసిన అత్త.. ఎవరిని? భర్త ఆర్మీ ఆఫీసరైనప్పటికీ?
కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడిన ఘటన పాకిస్థాన్‌లోని పెషావర్‌లో చోటుచేసుకుంది. అయితే కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మామను అత్త కాల్చి చంపేసింది. పెషావర్‌లోని కైబర్ పక్‌దున్వా షంగ్లా అనే గ్రామంలో ఓ వ
కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడిన ఘటన పాకిస్థాన్‌లోని పెషావర్‌లో చోటుచేసుకుంది. అయితే కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మామను అత్త కాల్చి చంపేసింది. పెషావర్‌లోని కైబర్ పక్‌దున్వా షంగ్లా అనే గ్రామంలో ఓ వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతనికి ఇటీవలే వివాహం అయ్యింది. వివాహానికి అనంతరం ఆర్మీ ఆఫీసర్ తన భార్యను అతని తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి వెళ్లాడు.
కానీ కంచె చేనును మేసిన తరహాలో కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని భర్తతో చెప్పినా.. తండ్రి కావడంతో ఏమీ చేయలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని మూడు నెలల పాటు నరకం అనుభవించిన బాధితురాలు అత్త (బేగం బీబీ)తో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వెల్లడించింది. దీంతో కోపంతో ఊగిపోయిన బేగం... తుపాకీతో నిద్రిస్తున్న తన భర్తను కాల్చిపారేసింది. ఆపై పెషావర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. కుటుంబ బాంధవ్యాలు, విలువల పవిత్రను గౌరవించలేని తన భర్తను తానే స్వయంగా కాల్చి చంపేశానని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై న్యాయస్థానంలో ఆమెను హాజరుపరిచి.. జైలుకు తరలించారు.