Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీజ్ ఫైర్ ఒప్పందం రద్దు : కాల్పులకు తెరలేపిన పాకిస్థాన్

Advertiesment
firing at loc

ఠాగూర్

, శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (09:13 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం రద్దు అయింది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తలు నెలకొన్నాయి. సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడుతుంది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా తిప్పికొడుతుందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 
కాల్పుల విరమణ అమలులో లేని కారణంగా సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రికత్త మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొత్తం మూడు ప్రాంతాల్లో పాక్ చెక్ పోస్టుల నుంచి కాల్పులు జరుపుతుంది. భారత సైనిక బలగాలు కూడా శత్రుసైన్యానికి ధీటుగా బదులిస్తున్నాయి. ఈ దాడిలో పాక్ సైనికులు మృతి చెందినట్టు సమాచారం. 
 
మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత.. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి 25 మంది భారత పర్యాటకులను హతం చేయడంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడులపై భారత్ దౌత్యపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో ప్రధానంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి, తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. భారత్ తీసుకున్న ద్వైపాక్షిక చర్యలపై పాక్ కూడా ధీటుగానే ప్రతిస్పందించింది. 
 
పాక్ భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన ఆ దేశ అత్యున్నత కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమై తాజా పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించింది. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యలన్నీ దాదాపుగా భారత్ తీసుకున్న చర్యలనే పాకిస్థాన్ కాపీ కొట్టింది. 
 
సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా తమ దేశంలో పర్యటిస్తున్న భారత జాతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాలను పాక్ రద్దు చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భారత ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయాన్ని బుధవారమే తీసుకుంది. భారత్‌లోని హైకమిషన్‌ కార్యాలయంలో సిబ్బందిని 30కి తగ్గించింది. భారత్ కూడా ఇదే చర్యలను ప్రకటించింది. అలాగే అటారీ సరిహద్దులను మూసివేయాలని భారత్ నిర్ణయించగా, పాకిస్థాన్ సైతం వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
దీంతో పాటు పాక్ గగనతలంలోకి భారత్‌కు చెందిన విమానాలు గానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గానీ ప్రయాణించకుండా ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. కాగా, సౌదీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని స్వదేశానికి వచ్చిన ప్రధాని మోడీ విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం