ఢిల్లీ యువతిని బంధించారు.. వెంటనే విడిపించండి.. ఓ పాకిస్థానీ యువకుడు
ఢిల్లీ యువతిని ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో బంధీగా ఉంచారని.. ఆమెను వెంటనే విడిపించాలని ఓ పాకిస్థానీ యువకుడు డిమాండ్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉజ్మా అనే యువతి మలేషియాలో ఉన
ఢిల్లీ యువతిని ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో బంధీగా ఉంచారని.. ఆమెను వెంటనే విడిపించాలని ఓ
పాకిస్థానీ యువకుడు డిమాండ్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉజ్మా అనే యువతి మలేషియాలో ఉన్న వేళ, తాహిర్ అనే పాకిస్థానీ యువకుడు పరిచయం కాగా.. ప్రేమించుకుని మే3న వివాహం చేసుకున్నారు.
ఆపై ఉజ్మాకు వీసా కోసం ఇస్లామాబాద్‌లోని హై కమిషన్ భవనానికి వెళ్ళి, వీసా పత్రాలను సమర్పించగా.. అధికారుల ఆదేశంతో లోనికి వెళ్లిన ఉజ్మా ఇంకా బయటకు రాలేదు. ఆమెను కార్యాలయంలోనే భారత అధికారులు బంధించారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారు.
దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ఆమె హై కమిషన్ సహాయాన్ని కోరిందని.. ఓ కౌన్సిలర్ ఆమెకు సాయపడుతున్నాడని పేర్కొంది.