Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదంపై దిగివచ్చిన చైనా.. జాబితాలో లష్కరే తాయిబా, జైషేమహ్మద్

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ కూటమి మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల చిట్టావిప్పింది. ప్రాంతీయంగా అవి సృష్టిస్తున్న హింసాకాండను వేలెత్తి చూపింది.

ఉగ్రవాదంపై దిగివచ్చిన చైనా.. జాబితాలో లష్కరే తాయిబా, జైషేమహ్మద్
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:58 IST)
చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ కూటమి మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల చిట్టావిప్పింది. ప్రాంతీయంగా అవి సృష్టిస్తున్న హింసాకాండను వేలెత్తి చూపింది. లష్కరే తాయిబా, జైషేమహ్మద్ వంటి సంస్థలను నేరుగా ప్రస్తావించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, వారి నిర్వాహకులను లేదా సమర్థకులను చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టంచేసింది.
 
వాస్తవానికి గతంలో పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల తీరుపై భారత్ తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. అయితే, భారత్ ఇలాంటి అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు బ్రిక్స్ సదస్సు సరైన వేదిక కాదని చైనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే చైనా ఇప్పుడు ఓ మెట్టు దిగివచ్చి సంయుక్త ప్రకటనలో పాక్ ఉగ్రవాద సంస్థల జాబితాను చేర్చడానికి అంగీకరించడం గమనార్హం. 
 
అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని కూడా ఆ ప్రకటనలో బ్రిక్స్ దేశాధినేతలు తెలిపారు. అంతరిక్షరంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచుకుంటామని, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ఉత్పాతాల నివారణ వంటి అంశాల్లో అంతరిక్ష విజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటామని తెలిపారు. శిలాజ ఇంధనాలను ప్రభావయుతంగా వినియోగించాలని, సహజవాయువు, జలవిద్యుత్తు, అణుశక్తి వినియోగాన్ని విస్తృతపర్చాలని ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యేలకు గృహాలు అద్దెకివ్వమంటున్న ముంబై వాసులు