Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెత్తురోడిన ఇథియోపియా - 230 మంది ఊచకోత

deadbody
, సోమవారం, 20 జూన్ 2022 (08:07 IST)
ఇథియోపియా దేశంలో మరోమారు నెత్తురోడింది. ఈ దేశం జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడికిపోయింది. ఈ ఘర్షణలో వివిధ జాతుల ప్రజలు ఒకరినొకరు ఊచకోత కోసుకున్నారు. దీంతో ఏకంగా 230 మంది ప్రాణాలు కోల్పోయారు. అమ్హారా తెగకు చెందిన 200 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. 
 
దేశంలోని ఒరోమియా రీజియన్‌లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నరమేధానికి ఓ తిరుగుబాటు సంస్థే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల రెండో దేశమైన ఇథియోపియాలో ఇటీవలి కాలంలో జాతుల ఘర్షణలు పెరిగాయి. 
 
తాజా మారణ హోమానికి ఒరోమో లిబరేషన్‌ ఆర్మీ(వోఎల్‌ఏ)దే బాధ్యత అని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులూ ఆరోపించారు. ఈ ఆరోపణలను వోఎల్‌ఏ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ ఖండించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా "అగ్నివీరుల సెగలు" - నేడు భారత్ బంద్ పిలుపు