పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు అల్‌ఖైదా మాజీ చీఫ్ బిన్ లాడెన్‌కు ఏమాత్రం తేడా లేదని, ఒక్క మాటలో చెప్పాలని మరో బిన్ లాడెన్... అసీం మునీర్ అని అమెరికా రక్షణ కార్యాలయమైన పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ సైన్యాధిపతి అసీం మునీర్... అణు బెదిరింపులకు పాల్పడిన విషయం తెల్సిందే. తమను నాశనం చేయాలని భావిస్తే తాము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బహిరంగ బెదిరింపులకు పాల్పడిన విషయంతెల్సిందే. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. వీటిపై మైఖెల్ రూబిన్ ఘాటుగా స్పందించారు.
అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ బెదిరింపుల నేప్యంలో ఒక దేశంగా పాకిస్థాన్ దాని బాధ్యతలను నిర్వహించగలుగుతుందా అనే ప్రశ్నలు అనేకమంది ప్రజల్లో లేవెనెత్తుతున్నాయన్నారు. ఈ సందర్భంగా అసీం మునీర్ ప్రవర్తన ఒసామా బిన్ లాడెన్‌లా ఉందని వ్యాఖ్యానించారు.
ఆయన మాటలను ట్రంప్ పరిపాలనాధికారులు వెంటనే ఖండించి.. దేశం నుంచి బహిష్కరించి ఉండాల్సిదని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న పాక్.. చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును కోల్పోయిందన్నారు.