ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఆధునిక యుగం వచ్చినా.. ప్రపంచంలో అత్యాధునిక వస్తువులను క్రేజ్ ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా పాత నాణేలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గలేదు. ముఖ్యంగా పాత వస్తువులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీరు పాత నాణేలు, నోట్లు, స్టాంప్‌లను సేకరిస్తుంటారు. అలా సేకరించిన ఈ పాత నాణెం కోట్లు పలికింది.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్లు పలికింది.. ఆ ఒక్క రూపాయి నాణెం. వివరాల్లోకి వెళితే... ఒక పురాతన, బ్రిటీష్ పాలనా కాలానికి చెందిన నాణెన్ని ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఆ నాణెన్ని ఓ వ్యక్తి రూ. 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. కారణం ఇది చాలా అరుదైన నాణెం. 1885లో భారతదేశంలో బ్రిటీష్ పాలనా కాలంలో ఈ నాణెన్ని జారీ చేశారు.
అందుకే దానిని కొనుగోలు చేసేందుకు సదరు కొనుగోలుదారుడు అంత ఆసక్తి కనబరిచాడు. ఒక నాణెం ఇంతపెద్ద మొత్తంలో పలకడంతో.. విక్రేత మొదలు విషయం తెలిసిన అందరూ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.