భార్య ముందే ప్రియురాలితో శృంగారం... ఆ తర్వాత ఎయిడ్స్ వచ్చిందనీ...
ఓహియోకు చెందిన ఓ భర్త.. తన భార్యముందే అతి నీచమైన పనికి పాల్పడటమే కాకుండా తన ప్రియురాలి పీడ వదిలించుకునేందుకు ఆమెకు ఎయిడ్స్ వచ్చిందని నమ్మించి హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఓహియోకు చెందిన ఓ భర్త.. తన భార్యముందే అతి నీచమైన పనికి పాల్పడటమే కాకుండా తన ప్రియురాలి పీడ వదిలించుకునేందుకు ఆమెకు ఎయిడ్స్ వచ్చిందని నమ్మించి హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే....
ఓహియోకు చెందిన మార్‌డోక్ (51) అనే వ్యక్తి తన భార్య టోలెడో, కుమారుడు, ప్రియురాలు కెంప్లర్ (51)తో కలిసి ఒకే ఇంట్లో నివశిస్తున్నారు. అయితే, మార్‌డోక్, కెంప్లెర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. భార్య, బిడ్డ పక్కనున్నారనే విషయాన్ని కూడా మరచి... వారు వారి ఎదుటే శృంగారంలో పాల్గొంటూ వచ్చారు. తన భర్తకు ప్రియురాలిపై ఉన్న ప్రేమతో భార్య అన్నీ సహిస్తూ వచ్చింది.
అయితే, ప్రియురాలిని వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన మార్‌డోక్... హఠాత్తుగా ఒక రోజు ప్రియురాలికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని నమ్మించాడు. మరుసటి రోజున ఆమెను హత్య చేసి సముద్రంలో పడేశాడు. తనపై అనుమానం రాకుండా ఆధారాలన్ని చెరిపేశాడు.
కానీ, ప్రియురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించి, మార్‌డోక్(51)ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కెంప్లర్(51)తో తనకు వివాహేతర సంబంధం ఉందని కోర్టులో అంగీకరించి, ఆమె ఎయిడ్స్ వ్యాధితోనే చనిపోయిందని కోర్టుకు తెలిపాడు.
కానీ, అది నిజం కాదని తన తల్లి మరణానికి డోక్ కారణమని కెంప్లెర్ కుమారుడు ఆరోపించాడు. అలాగే, తన భర్తే ఈ హత్య చేసినట్టు మార్ డోక్ భార్య కూడా కోర్టుకు సాక్ష్యం చెప్పింది. తన కళ్లముందే వారు శృంగారంలో పాల్గొనేవారని అయితే తాను అవన్నీ సహించానని తెలిపింది. కెంప్లర్, తన భర్త కోసం ఏం చేసేందుకైన సిద్ధపడేదని దాంతో వారిద్దరి ప్రేమకు తాను అడ్డుచెప్పలేదని తెలిపింది. డోక్, తన ప్రియురాలిని చంపాడని కోర్టు నమ్మింది. మార్‌డోక్‌కు శిక్షను ఖరారు చేయాల్సి వుంది.