సర్జికల్ స్ట్రైక్స్: డ్యాన్సింగ్ గాళ్‌తో కుట్ర.. పాకిస్థాన్‌కే దక్కుతుందట..
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాకిస్థాన్ ఓ కళాఖండాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. సింధులోయలో బయటపడిన మొహంజదారో నాగరికత నాటి కాం
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాకిస్థాన్ ఓ కళాఖండాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. సింధులోయలో బయటపడిన మొహంజదారో నాగరికత నాటి కాంస్య విగ్రహాన్ని భారత తమకు అప్పగించాలని డిమాండ్ చేయనున్నట్లు పాక్ పత్రికలు కథనాలు ప్రచురించాయి.
4500 ఏళ్ల నాటి ‘డ్యాన్సింగ్ గాళ్’ విగ్రహాన్ని సింధులోయ ప్రాంతంలో 1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మాకే గుర్తించారు. ఇది ప్రస్తుతం న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంది.
అయితే, ప్రస్తుతం ఆ ప్రాంతం పాక్‌లో ఉన్నందున.. యునెస్కో మార్గదర్శకాల ప్రకారం ఆ కళాఖండం తమకే దక్కుతుందని పాకిస్థాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్స్ డెర్టెక్టర్ జనరల్ సయీద్ జమాల్ షా చెప్పిన్నట్లు పాక్ పత్రికలు కథనం ప్రచురించాయి. దీని తమకు అప్పగించాలని త్వరలోనే భారత్‌ను డిమాండ్ చేయనున్నట్లు పాక్ తెలిపింది.
ఇదిలా ఉంటే.. కాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను, మరో పోలీసు గాయపడ్డారు.
ప్రభుత్వ భవనంలో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు భావిస్తుండటంతో సైన్యం వారిని చుట్టుముట్టింది. తొలుత ఉగ్రవాదులు పాంపోర్‌లోని ఇడిఐ భవనంలో ఉన్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందడంతో వారు ఆ భవనాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సైనికులను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.